39.2 C
Hyderabad
April 28, 2024 13: 51 PM
Slider ప్రపంచం

కరోనా ఎఫెక్ట్: పాకిస్తాన్ రాజధానిలో మళ్లీ లాక్ డౌన్ విధింపు

#Lockdown

పెరిగిపోతున్న కరోనా కేసులతో పాకిస్తాన్ తల్లడిల్లిపోతున్నది. ఇస్లామాబాద్ నేటి రాత్రి నుంచి పూర్తి లాక్ డౌన్ ప్రకటించారు. ప్రతి శుక్ర, శని, ఆదివారాలలో పాకిస్తాన్ రాజధాని లోని అన్ని రకాల వాణిజ్య ప్రాంతాలలో కూడా లాక్ డౌన్ ప్రకటించారు.

హోటళ్లు, వినోద కేంద్రాలను కూడా మూసివేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ఏవైనా సభలు, సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే ముందుగా అనుమతులు తీసుకోవాలని ఆంక్షలు జారీ చేశారు.

ఆరుబయట జరిగే వినోద కార్యక్రమాలు, విందువినోదాలకు 300 మంది కన్నా ఎక్కువ మందిని అనుమతించేది లేదని ఆదేశాలు వెలువడ్డాయి. చివరికి అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలలో కూడా 50 శాతానికి మించకుండా మాత్రమే ఉద్యోగులను అనుమతించాలని నిర్ణయించారు.

Related posts

వైజాగ్ ట్రాజెడీ: యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం

Satyam NEWS

ఆర్ఎస్ యు 5వ మహాసభల కరపత్రం విడుదల

Satyam NEWS

హీటెక్కిన యూపీ ఎన్నికల ప్రచారం

Sub Editor

Leave a Comment