28.7 C
Hyderabad
April 26, 2024 10: 10 AM
Slider మహబూబ్ నగర్

వరిదేల శిఖం భూమిని ఆక్రమిస్తే చర్యలు తప్పవు: ఆర్డీఓ

#sikhamland

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఆర్డిఓ హనుమా నాయక్ హెచ్చరించారు. కొల్లాపూర్ పట్టణ పరిధిలోని వరిదేల చెరువు శిఖం భూమి 82 ఎకరాలు ఉంది. అయితే అందులో 39 ఎకరాలు కబ్జాకు గురయ్యింది.

ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో శనివారం కొల్లాపూర్ ఆర్డీఓ హనుమా నాయక్, తహాసిల్దార్ రమేష్ నాయక్, మున్సిపల్ కమిషనర్ సొంటే రాజయ్య  ఇరిగేషన్ అధికారులతో వరిదేల శిఖం భూములను పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడారు.

మొత్తం వరిదేల శిఖం భూమి 82 ఎకరాలు ఉందన్నారు. అయితే చెరువు దగ్గరలో  అక్కడ కొందరు ఇండ్లు కట్టుకోవడంతో 39 ఎకరాలు కబ్జా అయిందన్నారు. ప్రస్తుతం 47 ఎకరాలు ఉందన్నారు. ఎవరైనా  కబ్జాలకు ప్రయత్నాలు చేస్తే చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకుంటామని హెచ్చరించారు.

Related posts

ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ

Satyam NEWS

నంద్యాల ప్రాంతంలో భారీ ఎత్తున పట్టుబడ్డ డబ్బులు

Satyam NEWS

జగనన్న ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి

Bhavani

Leave a Comment