40.2 C
Hyderabad
April 29, 2024 17: 16 PM
Slider ఖమ్మం

విదేశీ దంపతులకు బాలిక దత్తత

#foreign couple

మన దేశం కాదు.. మన రాష్ట్రం కాదు.. మన ఊరు కాదు . ఎక్కడో.. తల్లి కేరళ, తండ్రి ఆస్ట్రేయా.. ఇద్దరు యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా స్థిరపడ్డారు. ఈ దంపతులు భారత దేశం నుండి అనాధ బాలికని దత్తత తీసుకోవాలని ర్ణయించుకున్నారు. ఇంటర్నెట్లో భారత దేశం పిల్లల దత్తత గురించి తెలుసుకొని, అక్కడి వర్గాల సూచన మేరకు భారత దేశం పిల్లల దత్తత గురించి ఆరా తీశారు. కేంద్ర శిశు, మహిళా సంక్షేమశాఖ ద్వారా అధికారికంగా www.cara.nic.in లో బాలిక దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నారు.

అనంతరం ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తో వీడియో కాల్ నందు మాట్లాడి వివరాలు తెలుసుకొని వారి ధ్రువపత్రాలు పరిశీలించి, వారు సమర్పించిన పత్రాలన్నీ పక్కాగా ఉన్నాయని నిర్ధారించి, దత్తతకు అంగీకరించారు. ఈ మేరకు గురువారం నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో విదేశీ దంపతులకు బాలిక ను (Mr. Florian Hackl and Mrs.Geena Kuriakose Athappily) అప్పగించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పిల్లల దత్తత కావాల్సిన వారు www.cara.nic.in నుండి చట్టబద్దంగా స్త్రీ- శిశు సంక్షేమ శాఖ ద్వారా అధికారికంగా దత్తత కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.ఈ దత్తత కార్యక్రమములో జిల్లా సంక్షేమ అధికారిణి సుమ, డిసిపిఓ విష్ణు వందన, పిఓఐసి సోనీ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీఎం కేసీఆర్‌తో డోనాల్డ్ ట్రంప్‌ కరచాలనం

Satyam NEWS

సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Murali Krishna

ఆకట్టుకుంటున్న అక్కినేని నాగచైతన్య “థ్యాంక్యూ” టీజర్

Satyam NEWS

Leave a Comment