42.2 C
Hyderabad
April 26, 2024 15: 26 PM
Slider ప్రత్యేకం

వ్యాక్సినేషన్ తర్వాత కరోనా సోకితే దాని అర్ధం ఏమిటి?

#coronavaccine

కోవిడ్ వ్యాక్సినేషన్ తరువాత కరోనా పాజిటివ్ వస్తే అనే అంశంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లను ఏపి ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇలాంటి పుకార్లపై ఎటువంటి ఆందోళనా చెందవద్దని ప్రభుత్వం ప్రజలకు పూర్తి  భరోసా ఇస్తోంది.

కోవాక్సిన్ అనేది  ఉత్తేజం లేని వ్యాక్సినే తప్ప శక్తి లేనిది కాదు. ఇందులో SARS Cov2 వైరస్ లేదు

అదే విధంగా కోవిషీల్డ్ అనేది వైరల్ వెక్టార్ వ్యాక్సినే కానీ శక్తి లేనిది కాదు. ఇందులో కేవలం SARS Cov2 యొక్క జన్యు పదార్ధంలో కొంత భాగం మాత్రమే ఉంటుంది.

ఈ రెండు వ్యాక్సిన్లలో ఏ ఒక్కటీ RTPCR పాజిటివ్ కు  దారితీయవు. వ్యాక్సినేషన్ తరువాత RTPCRలో పాజిటివ్ నిర్ధారణ అయితే, వారిలో కోవిడ్ వ్యాధి ఉనికి ఉందని అర్ధం.

అంతేకానీ వ్యాక్సినేషన్ కారణంగా ఈ పాజిటివ్ వచ్చినట్లు కాదు. కోవిడ్ వ్యాక్సినేషన్ తరువాత జ్వరం వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

పారాసిటమాల్   మందు బిళ్లలతో చికిత్స అందించవచ్చు అని ఎ.పి కమాండ్ కంట్రోల్ తెలిపింది.

Related posts

టీచర్ రిక్రూట్ మెంట్ స్కామ్ లో మంత్రి పార్థ అవుట్

Satyam NEWS

పాజిటీవ్ కేసులు పెరిగినా ప్రజలు భయపడవద్దు

Satyam NEWS

పీఈటీ, పండిట్ టీచర్ల నల్ల బ్యాడ్జీల నిరసన

Bhavani

Leave a Comment