38.2 C
Hyderabad
May 1, 2024 20: 59 PM
Slider ఖమ్మం

ఏజెన్సీ ప్రాంత యువకులు అన్ని రంగాల్లో రాణించాలి

#VOLLLEYBALL

ఏజెన్సీ ప్రాంత యువకులు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. చదువుతోపాటు క్రీడల్లో కూడా ప్రతిభను చాటి తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని  భద్రాచలం ఏ‌ఎస్‌పి రోహిత్ రాజ్ పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన దుమ్ముగూడెం మండల స్థాయి వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఏఎస్పీ రోహిత్ రాజ్ విజేతలకు బహుమతులు అందించారు. 50 వాలీబాల్ టీమ్ ల మధ్య మూడు రోజులు పాటు జరిగిన ఈ పోటీలలో మొదటి బహుమతిని కొత్తమారెడుబాక, రెండవ బహుమతిని కోయనరసాపురం, మూడవ బహుమతిని చిన్న బండిరేవు టీం లు గెలుచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోహిత్ రాజ్ మాట్లాడుతూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, సంఘ వ్యతిరేక శక్తులకు సహకరించకుండా తమ భవిష్యత్తును తామే తీర్చిదిద్దుకోవాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంత యువకులకు చదువుతో పాటు తమ ప్రతిభను బయటకు తీసుకొచ్చే విధంగా ఈ క్రీడా పోటీలను పోలీసు శాఖ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మరెన్నో కార్యక్రమాలను ఏజెన్సీ ప్రాంత వాసుల కొరకు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ క్రీడా పోటీలను ఎంతో ఘనంగా ఏర్పాటు చేసిన దుమ్ముగూడెం పోలీసు అధికారులను సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్, ఎస్సై రవి, సిబ్బంది,స్థానిక ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గోన్నారు.

Related posts

తెలంగాణలో కంపెనీ కార్యకలాపాలను రెట్టింపు చేస్తున్న పెప్సికో

Bhavani

ఈసారి సరికొత్తగా:మళ్ళీ మార్కెట్ లోకి బజాజ్ చేతక్

Satyam NEWS

అవమానకర రీతిలో గౌతమ్ సవాంగ్ అవుట్

Satyam NEWS

Leave a Comment