26.7 C
Hyderabad
April 27, 2024 10: 53 AM
Slider మహబూబ్ నగర్

బిసి బాలికల వసతి గృహాంలో సైబర్‌నేరాలపై అవగాహన

#kollapur

సైబర్‌నేరాల పట్ల విద్యార్దులు అవగాహన పెంచుకోవడంతో పాటు తల్లిదండ్రులకు తెలియజేయాలని నాగర్‌కర్నూల్‌ ఎస్సై వీణారెడ్డి అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బిసి బాలికల కళాశాల  వసతిగృహంలో విద్యార్దులకు సైబర్‌నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల నుండి ఫోన్‌కాల్స్‌ వచ్చినపుడు స్పందించకూడదని, ఓటిపిని ఎవరి షేర్‌ చేయకూడదని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు రోజు,రోజుకు పెరిగిపోతుండటంతో ఆన్‌లైన్‌ మోసాలు, సైబర్‌నేరాలు పెరిగిపోతున్నాయని వాటిపట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు.

సైబర్‌ నేరగాళ్ల భారినపడి మోసపోతే వెంటనే డయల్‌ 100కు , 1930 కిఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. పోలిసులకు త్వరగా  ఫిర్యాదుచేస్తే  సైబర్‌నేరగాళ్ల నుండి పోయిన నగదును రికవరీ చేసేందుకు వీలవుతుందని అన్నారు. ప్రస్తుతం సెల్‌ఫోన్‌వాడకం ఎక్కువకావడంతో యువత పెడదారిపడుతున్నారని సెల్‌ఫోన్‌ వాడకం తగ్గించుకుని విద్యార్దులు చదువుపై శ్రద్ద వహించాలని సూచించారు. ఎవరైనా అమ్మాయిలను, మహిళలను వేదింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, వేదింపులకు గురయితే పోలిసులకు ధైర్యంగా ఫిర్యాదుచేయాలన్నారు.  కార్యక్రమంలో హెచ్‌డబ్ల్యూఓ తరంగిణి, ఎఎస్సై నిరంజన్‌రెడ్డి, కానిస్టేబుళ్లు రాము, శ్రీశైలం తదితరులు ఉన్నారు.

Related posts

ట్విట్టర్ టిల్లు పది నిమిషాల్లో స్పందించాలి

Satyam NEWS

ప్రవాస భారతీయుడు సమీర్ పెనకలపాటి భక్తి పూర్వక సమర్పణ అయోధ్య శ్రీరామ్ ఆల్బమ్

Satyam NEWS

11న ఛలో ఆత్మకూరు విజయవంతం చేయండి

Satyam NEWS

Leave a Comment