28.7 C
Hyderabad
April 28, 2024 05: 09 AM
Slider ముఖ్యంశాలు

ఏయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వ పెత్తనం వాంఛనీయం కాదు

#telugudeshamstudents

ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రైవేట్ విద్యా సంస్థలు గా మార్చడం సిగ్గుచేటని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు గోపాల్ అన్నారు. కడపజిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఏ ఓ కి టిఎన్ఎస్ఎఫ్ నాయకులు వినతి పత్రం సమర్పించారు

ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చదువు దూరం చేసే ప్రయత్నంలో భాగంగా ఏయిడెడ్ విద్యా సంస్థలును ప్రైవేట్ విద్యా సంస్థలు గా  మార్చారు అన్నారు.  ప్రైవేట్, ఎయిడెడ్ విద్యా సంస్థలకు (పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు ) ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం నిలిపి వేయాలని, వాటిని ప్రైవేటుగా నిర్వహించు కోవాలని లేదా ప్రభుత్వానికి అప్పగించాలని కోరుతూ ఏ పి విద్యా చట్టం 1982 సెక్షన్ 93 కు సవరణ చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్సు 12 / 202: రద్దు చేయాలన్నారు

ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలను, ప్రైవేట్ కళాశాలలుగా మార్పు చేసే ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ను తక్షణమే ఉపసంహరించాలి డిమాండ్ చేశారు.

ప్రైవేట్ విద్యా సంస్థలలో చదవలేని పేద విద్యార్థులు చదువుకు దూరమై రాష్ట్ర వ్యాప్తంగా డ్రాప్ అవుట్ రేట్ పెరిగి నిరక్షరాస్యత రేటు ఎక్కువ అవడం , ఇది విద్యా హక్కు చట్టానికి వ్యతిరేఖం అన్నారు పాఠశాలలను ప్రైవేట్ పరం చేయడం వలన ప్రాధమిక విద్య అనే ప్రాధమిక హక్కుకు విద్యార్థులు దూరం అవుతారు ఇది రాజ్యాంగ వ్యతిరేకమన్నారు

ఈ రాష్ట్ర ప్రభుత్వం  ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని జీవో నెంబర్ 50 ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో లో టి ఎన్ ఎస్ ఎఫ్ జిల్లా ప్రచార కార్యదర్శి పోలీ శివకుమార్ మండల అధ్యక్షుడు శివ కృష్ణ ప్రధాన కార్యదర్శి  సురేంద్ర, సూరి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

డిసెంబర్‌ మొదటి వారంలో రైతుబంధు

Murali Krishna

జన్మదిన కానుక

Satyam NEWS

ఫిబ్ర‌వ‌రి 8న తిరుమ‌ల‌లో ఏకాంతంగా రథసప్తమి

Satyam NEWS

Leave a Comment