42.2 C
Hyderabad
April 26, 2024 18: 08 PM
Slider నల్గొండ

ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన

#janachitanya

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో బుధవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా హెచ్ ఐ వి పై  అవగాహన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో  హుజూర్ నగర్ ఏరియా ప్రభుత్వ వైద్యాశాల హెచ్ ఐ వి డిపార్ట్మెంట్ ఇంచార్జ్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులకు మన పుట్టుకే ఎన్నో సాహసాల మయమని,ఠఎయిడ్స్ ఎంత ప్రమాదకరమైనదో తెలుపుతూ అట్టి దానిని తరిమెద్దామని,దైర్యమే ఆయుధం అంటూ ప్రసంగించారు.

జన చైతన్య ట్రస్ట్ వ్యవస్థాపకుడు పినపారాళ్ల వంశీ,ఉపాధ్యక్షులు పిల్లి శివశంకర్,కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్, కామర్స్ అధ్యాపకుడు రమేష్,అధ్యాపక బృందం విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహనా ఉపన్యాసాలు ఇచ్చారు. అనంతరం కళాశాలలో జనచైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో హరికృష్ణ డైయాగ్నస్టిక్ సెంటర్ సహకారంతో విద్యార్థులకు ఉచితంగా బ్లడ్ గ్రూప్ పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమం జనచైతన్య ట్రస్ట్  అధ్యక్షుడు పార సాయి,సభ్యులు సిద్ధూ, శ్రీపతి,కళాశాల ఉపాధ్యాయులు,హరికృష్ణ డైయాగ్నీటిక్ సెంటర్ టెక్నీషియన్స్ మహేష్,ఆజ్మద్,అనిల్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

బిల్లులు కట్టలేక లబోదిబో అంటున్న జనాలు…

Bhavani

న్యూ ఇయర్ వేడుకల్లో విషాద ఘటన…!

Satyam NEWS

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎంత వరకూ వచ్చింది?

Satyam NEWS

Leave a Comment