42.2 C
Hyderabad
May 3, 2024 15: 58 PM
Slider హైదరాబాద్

బిల్లులు కట్టలేక లబోదిబో అంటున్న జనాలు…

స్థానిక ప్రజలపై పన్నుల భారం మోపడమే కాకుండా ఏకకాలంలో బిల్లులు చెల్లించాలని అధికారులతో ఒత్తిడి చేయిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ఆరోపించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తన మానసపుత్రికలని, అందరికీ 20000 లీటర్ల వరకు మంజీరా నీరు ఉచితంగా ఇవ్వడం తన లక్ష్యం అని చెప్పుకునే కెసిఆర్ పేద వారికి వేల రూపాయల వాటర్ బిల్లులు వేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ఈరోజు హైదరాబాద్ లోని కొండపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ బి బ్లాక్ లో బస్తీ వాసుల పిలుపు మేరకు వెళ్లి ఆయన పర్యటించడం జరిగింది. జిహెచ్ఎంసి ఎలక్షన్స్ జరిగే టైం లో ఓట్ల కోసం మంత్రి కేటీఆర్ ఒక రూపాయికే నల్ల కనెక్షన్ ఇస్తామని చెప్పి ఓట్లు వేసుకొని గద్దెనెక్కినాక ఇప్పుడు మోసం చేశారని ఆయన అన్నారు.

కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఆయన పేదలకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తున్నారు. స్థానికుల సమక్షంలో వాటర్ బోర్డ్ మేనేజర్ తో మాట్లాడి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. వారు కూడా పరిశీలించి బిల్లులు కట్టకుండా చూస్తామని , వాటర్ కనెక్షన్లు కట్ చేయమని హామీ ఇచ్చారు. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చేసే దిశగా అధికారులతో మాట్లాడి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ యాదవ్, గోపాల కృష్ణ, రాజు , రెహ్మతుల్ల, నర్మద, నాగమణి, నర్సమ్మ పాల్గొన్నారు.

Related posts

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన జడ్పిటిసి సభ్యురాలు

Satyam NEWS

క‌రోనా వ్యాధిని అరిక‌ట్టేందుకు అన్నివిధాలా స‌హ‌కారం

Satyam NEWS

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

Leave a Comment