28.7 C
Hyderabad
April 28, 2024 07: 23 AM
Slider ముఖ్యంశాలు

హైదరాబాద్ కు ప్రారంభమైన విమానాల రాకపోకలు

#Chief Secretary of Telangana

శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ విమానాల రాకపోకలు నేడు ప్రారంభమవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా  ఏర్పాట్లు చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా నిలిచిపోయిన విమాన ప్రయాణాలు హైదరాబాద్ కు నేడు ప్రారంభమయ్యాయి.

సీ.ఎస్ సోమేష్ కుమార్, జీ.ఏ.డీ కార్యదర్శి వికాస్ రాజ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ లతో కలసి జీ.ఎం.ఆర్ ఎయిర్ పోర్ట్ ను నేడు పరిశిలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, నేడు 19 విమానాలు హైదరాబాద్‌కు రావడంతో పాటు మరో 19 విమానాలు హైదరాబాద్ నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్లతాయని సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రయాణికుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.

కరోనా లక్షణాలు ఉంటే క్వారంటైన్ కే

ప్రధానంగా ఎయిర్ పోర్ట్ నుండి వెళ్లే ప్రయాణికులకు, ఇతర నగరాల నుండి వచ్చే ప్రయాణికులకు టెంపరేచర్ ను పరీక్షిస్తామని, టెంపరేచర్ తో కరోనా లక్షణాలుంటే రెగ్యులర్ ప్రోటోకాల్ పాటిస్తామని అన్నారు. ప్యాసింజర్‌ని టచ్ చేయకుండా సెన్సార్‌లు ఏర్పాటు చేసామని చెప్పారు.

ఇప్పటి వరకు వచ్చిన ఎవరికి కూడా కరోన లక్షణాలు లేవని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన  ఆదేశాల ప్రకారం సెక్యూరిటీ పరంగా, ఆరోగ్య పరంగా ఎయిర్ పోర్ట్ లో అన్ని జాగ్రత్తలు  తీసుకున్నామని వివరించారు. ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి అని, ఆరోగ్య సేతు యాప్ ఉన్నవాళ్లనే అనుమతిస్తున్నామన్నారు.

అన్ని విమానాలు నడుస్తున్నాయి

ఇప్పుడు వచ్చే వారికి పరీక్షల అనంతరమే అనుమతిస్తున్నామని, ఎలాంటి కరోనా లక్షణాలు లేని వారికి 14 రోజుల క్వారన్ టైన్  లేదని తెలిపారు. దాదాపు 1600 మంది ఇతర రాష్ట్రాల నుండి నేడు హైదరాబాద్‌కి వస్తున్నారన్నారు. ప్రయాణికులు లేకుంటే మాత్రమే ఫ్లయిట్స్ క్యాన్సల్ అవుతున్నాయని చెప్పారు.

సూచనలను ప్రయాణీకులు కచ్చితంగా పాటించాలి

రేపటి నుండి మరిన్ని విమాన సర్వీస్‌లు పెరిగే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. విదేశీ విమాన సర్వీస్ టర్మీనల్‌లను కూడా సందర్శించామన్నారు. ప్రభుత్వం, ఎయిర్‌పోర్టు అథారిటీ లు సూచించే సూచనలు, సలహాలు ప్రతి ప్రయాణికుడు పాటించాలని, ఎవరికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని సీఎస్ సోమేష్ కుమార్ పేర్కొన్నారు.

విమానాశ్రయంలోకి ప్రవేశించిన దగ్గరి నుండి విమానం ఎక్కేదాకా భౌతిక దూరం పాటిచండం, ప్రయాణికుల లగేజీతోపాటు ట్రాలీ వాహనాలను కూడా పూర్తిగా శానిటైజ్ చేసేందుకు ప్రత్యేక టన్నెల్ ను ఏర్పాటు చేశామని చెప్పారు.

Related posts

ఆకాశ హర్మ్యం బుర్జు ఖలీఫా కట్టిన కంపెనీ దివాలా

Satyam NEWS

ఆదాయం 6391 కోట్లు

Murali Krishna

ఆరేళ్లలో రూ. 8,113 కోట్లతో హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలు

Satyam NEWS

Leave a Comment