40.2 C
Hyderabad
April 29, 2024 18: 02 PM
Slider హైదరాబాద్

పేదల బస్తీల్లో ఇంటి వద్దకే పోషన్ అభియాన్

#PoshanAbhiyan

నాణ్యమైన పోషక ఆహారం అందించి తల్లీబిడ్డలను అరోగ్యం ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం పోషన్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది.

మాతాశిశు మరణాలను తగ్గించి బాలింతలకు చిన్న పిల్లలకు పౌష్టిక  ఆహారాన్ని అందించడం ద్వారా మాత శిశువులకు మంచి భోజనం అందించడం ఈ పథకం ముఖ్యఉద్దేశం.

ముషీరాబాద్ సెక్టార్ తాళ్ళ బస్తి అంగన్వాడిలో పోషణ మాసం విజయవంతంగా  కొనసాగుతుంది. పోషన్ మాస ఉత్సవాలను  అంగన్వాడీ కేంద్రాలలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారు.

ఈ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కేంద్రంలో  చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు పాలు, గుడ్డు, బాలామృతం కోవిడ్ కారణంగా ఇంటి వద్దనే అందిస్తున్నారు.

కరోనా వల్ల డిజిటల్ మాధ్యమాల ద్వారా సూచనలు సలహాలు అందిస్తున్నారు. చిన్నపిల్లకు గర్భిణీలకు, బాలింతలకు రోజువారీగా తీసుకోవాల్సిన ఆహారం గురించి అవగాహన కల్పిస్తున్నారు.

అంగన్వాడీ టీచర్లు కె.ఉమాదేవి, భాగ్యరేఖలు  మాట్లాడుతూ చిన్నారులు, గర్భిణీ లకు, బాలింతలకు పాలు , గుడ్డు, అన్నం, పప్పు , బాలామృతం కోవిడ్ నిబంధనల ప్రకారం ఇంటి వద్దనే అందిస్తున్నామని తెలిపారు.

వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు సూచనలు సలహాలు అందిస్తున్నామని వెల్లడించారు. పలువురు గర్భిణులు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా తమకు పౌష్టిక ఆహారం అందిస్తున్నారని పాలు, గుడ్డు, అన్నం, పప్పు, బాలామృతం అందిస్తున్నారని చెప్పారు.

గతంలో అంగన్వాడీ కేంద్రానికి వచ్చి ఆహారం తినేవాళ్ళమని కానీ కరోనా కారణంగా ఇంటికే సరుకులను పంపిస్తున్నారని చెప్పారు. మంచి ఆహారం అందించడం ద్వారా ఆరోగ్యంగా ఉన్నామని చెప్పారు.  పౌష్ఠిక ఆహారం అందించడం వల్ల మేము, పిల్లలు ఆరోగ్యాంగా ఉన్నామని తెలిపారు.

Related posts

రక్తదానంతో మరొకరికి ప్రాణం పోద్దాం

Bhavani

ఆత్మహత్యలు వద్దు… ఆశతో జీవించండి

Satyam NEWS

డ్రోన్ దెబ్బతో మళ్లీ చర్చలోకి వచ్చిన కాశ్మీర్ సమస్య

Satyam NEWS

Leave a Comment