28.7 C
Hyderabad
April 28, 2024 07: 39 AM
Slider విజయనగరం

ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోనేందుకు ప్రతీ ఒక్కరు అవగాహన కలిగివుండాలి

#vijayanagaram

ప్రకృతి వైపరీత్యాలు రెండు ర‌కాలని వాటిని ఎదుర్కోనేందుకు ప్రతీ ఒక్కరు అవగాహన కలిగివుండాలని జిల్లా రెవిన్యూ అధికారి గ‌ణ‌ప‌తిరావు అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కోనేందుకు ప్రతీ ఒక్కరు అవగాహన కలిగివుండాలని ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు పేర్కొన్నారు.

ఈ మేర‌కు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన  కేపాసిటీ బిల్డింగ్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.  జిల్లా కలెక్టర్  ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ప్రకృతి వైపరీత్యాలు ఊహించని విధంగా సంభవిస్తూవుంటాయని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి దాని ద్వారా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోనేందుకునేందుకు ప్రతీ ఒక్కరు సామార్థ్యాన్ని పెంచుకొనేందుకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

ప్రకృతి వైపరీత్యాలు స్థూలంగా రెండు రకాలని, తుఫానులు, సునామీలు, వరదలు, భూకంపాలు, కొండచెరియలు విరిగిపడడం,  కరువు, చీడపీడలు లాంటివి సహజ వైపరీత్యాలు అలాగే మొదటి ర‌కాలున్నారు.ఇక , మానవ కారక  వైపరీత్యాలలో సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం అగ్నిప్రమాదాలు, రోడ్, రైలు, ఎయిర్ ఎక్సిడెంట్లు, యుద్దాలు, పరిశ్రమల నుండి విషవాయువులు, హానికారక పదార్థాలు వెలువడం లాంటివి వస్తాయన్నారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా విప‌త్తుల నివార‌ణ అధికారి ప‌ద్మావ‌తి,  రెడ్ క్రాస్ సెక్రటరీ కె.సత్యం, మేనేజరు వెంకటేశ్వరరావు,  నీటిపారుదల, పంచాయితీరాజ్, మత్స్య, వ్యవసాయ, ఉద్యాన, విద్యుత్, పోలీస్, ఆగ్నిమాపక, ఆర్ అండ్ బి.  శాఖల అధికారులు, నెల్లిమర్ల, పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, గంట్యాడ, మెంటాడ, పార్వతీపురం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం మండలాల వి.ఆర్.ఓ.లు, పంచాయితీ సెక్రటరీలు, రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్లు పాల్గొన్నారు.

Related posts

మండిపోతున్న ఉత్తరాదికి ఉపశమనం

Satyam NEWS

కరోనా నియంత్రించకుంటే భవిష్యత్తు ఉండదు

Satyam NEWS

తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ

Bhavani

Leave a Comment