38.2 C
Hyderabad
April 27, 2024 15: 09 PM
Slider నల్గొండ

ఎన్.ఎస్.పి క్యాంపులో ఇంటిగ్రేటేడ్ మార్కెట్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపి వేయాలి

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎన్.ఎస్.పి. క్యాంపులో నిర్మాణం చేయాలనుకున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని నిలిపివేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు.

బుధవారం మున్సిపల్ 23వ,వార్డు కౌన్సిలర్ జక్కుల వీరయ్య ఆధ్వర్యంలో కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో టిఆర్ఎస్,సిపిఎం పార్టీలు మినహా అన్ని పార్టీల నాయకులు,చిరు వ్యాపారస్తు లైన పూలు,పండ్లు,చికెన్,మటన్,ఫిష్ వ్యాపార యజమానులు పాల్గొని ముక్తకంఠంతో ఎన్.ఎస్.పి.క్యాంపులో నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ 2017లో రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన స్థానంలో కాకుండా వేరే చోట మార్కెట్ ని నిర్మించాలని అనుకోవడం గౌరవ మంత్రి ని అవమానించడమేనని,గతంలో పట్టణంలోని సాయిబాబా థియేటర్ పక్కన ఆనుకొని ఉన్న 30 కోట్లు విలువ గల 5500 గజాల ప్రస్తుతం జిమ్ నిర్వహించినటువంటి స్థలాన్ని అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులకి కట్టబెట్టాలని ఆలోచనతోనే మార్కెట్ ని ఎన్.ఎస్.పి క్యాంపు లోకి మారుస్తున్నారని అన్నారు.గత వంద సంవత్సరాలుగా మటన్ మార్కెట్ బజార్ గా పేరుపడ్డ ప్రస్తుతం మటన్ మార్కెట్ ని అభివృద్ధి చేయాలని,పాత గ్రామపంచాయతీలో కొంతమందికి కేటాయించాలని కోరారు.

ఎన్.ఎస్.పి క్యాంపులో ఏర్పాటు చేయడం వలన ఆ స్థలానికి ఆనుకొని ఉన్న ఎన్ ఎస్ పి హైస్కూల్ లో,రిసోర్స్ భవన్,ఎస్సీ హాస్టల్ లో ఉంటున్న విద్యార్థులకు,అంగన్వాడి స్కూల్ లో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఇలా సుమారుగా వెయ్యి మంది విద్యార్థులకు అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ఎన్ ఎస్ పి కాలవ పూర్తిగా కలుషితం అవుతుందని,ఎంతో మంది రైతులు వారి యొక్క పొలాలను ఎన్ ఎస్ పి క్యాంప్ కార్యాలయం కొరకు, వారి యొక్క వసతి గృహాల కొరకు,చిన్న సన్నకారు రైతులు వారి యొక్క పొలాలను అతి తక్కువ ధరకే ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు రైతులకు మేలు జరిగే కార్యాలయాలు కూల్చివేసి ఆస్థానాలలో మార్కెట్ నిర్మాణం చేయటం హేయమైన చర్య అని దీనిని తక్షణమే నిలిపివేయాలని పట్టణ అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ సిపిఐ,టిడిపి,బిజెపి, వైఎస్ఆర్ సీపీ, బిఎస్పీ నాయకులతో పాటు చిరు వ్యాపారులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్,మూడో వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి,అఖిలపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి జక్కుల మల్లయ్య,బాచిమంచి గిరిబాబు,రామరాజు,ముక్కంటి, రామ్మూర్తి,ముషం సత్యనారాయణ, సొసైటీ డైరెక్టర్ జక్కుల నరేందర్,సిపిఐ పార్టీ నుండి యల్లావుల రమేష్, వైయస్సార్సీపి నుండి కామిశెట్టి రవి, సుతారి శ్రీను,రాజు,లక్ష్మణ్,రవీందర్ రెడ్డి టిడిపి నుండి మండవ వెంకటేశ్వర్లు, అలీ,ఎలక వెంకటేశ్వర్లు,వెంకట్ రామ్ నాయక్,బిజెపి నుండి కొప్పెర సాయి,వినోద్,బిఎస్పీ నుండి  చడపంగు యేసు పాదం తదితరులు పాల్గొన్నారు.

ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు,అఖిలపక్ష నాయకుల కి,వ్యాపారస్తులకు 23వ,వార్డు కౌన్సిలర్ జక్కుల వీరయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Related posts

తెలుగు సినిమాకు స్ఫూర్తి ప్రదాత డివిఎస్ రాజు

Satyam NEWS

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Satyam NEWS

మళ్లీ అప్పు చేసిన ఆంధ్రప్రదేశ్

Satyam NEWS

Leave a Comment