29.7 C
Hyderabad
May 6, 2024 03: 23 AM
Slider ముఖ్యంశాలు

విజయవంతంగా ముగిసిన అఖిలపక్ష సమావేశం

#Nimmagadda Rameshkumar

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కొనసాగించడంలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం నిరాటంకంగా కొనసాగింది. మొత్తం 19 పార్టీలకు అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానం పంపగా 11 రాజకీయ పార్టీలు తమ ప్రతినిధులను పంపి తమ అభిప్రాయాలు చెప్పాయి.

రెండు రాజకీయ పార్టీలు లిఖిత పూర్వకంగా తమ అభిప్రాయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ కు అందచేశాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆహ్వానం పంపినా కూడా ఆరు రాజకీయ పార్టీలు హాజరు కావడం కానీ, లిఖిత పూర్వక అభిప్రాయం తెలపడం గానీ చేయలేదు.

ఎన్నికల కమిషన్ ఆహ్వానానికి స్పందించని రాజకీయ పార్టీలు 1.నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ 2.తెలంగాణ రాష్ట్ర సమితి 3.యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 4. ఆల్ ఇండియా మస్లీజ్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 5. రాష్ట్రీయ లోక్ దళ్ 6. రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ.

బహుజన సమాజ్ పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.పుష్పరాజ్, భారతీయ జనతా పార్ట్ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి పాకా వెంకట సత్యనారాయణ, సిపిఐ నుంచి రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం నుంచి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు,

కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ, తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు, ఏఐఏడిఎంకే నుంచి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆంబ్రోస్ విల్సన్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పి వి సుందరరామరాజు,

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బషీర్ అహ్మద్, జనతా దళ్ (యునైటెడ్) నుంచి ఎన్. సాంబశివరావు, సమాజ్ వాదీ పార్టీ నుంచి డాక్టర్ వినయ్ పరుష్ యాదవ్ సమావేశానికి హాజరయ్యారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

అఖిల పక్ష సమావేశం నిర్వహించకుండా నిలుపుదల చేయాలని నిన్న రాత్రి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  

Related posts

కొన్ని ప్రాంతాల్లో వెనక్కి తగ్గుతామని హామీ ఇచ్చిన రష్యా

Satyam NEWS

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు

Satyam NEWS

ప్రజలకు సమాధానం చెప్పుకోలేక నా పై అసత్య ప్రచారాలా

Satyam NEWS

Leave a Comment