Slider విజయనగరం

విజయనగరం జిల్లాలో ఎన్నికలకు పకడ్బంది ఏర్పాట్లు

#SP VZNM

వ‌చ్చే నెల మార్చి 10 వ తేదీన రాష్ట్ర‌  వ్యాప్తంగా మున్సిప‌ల్స్ ఎన్నిక‌ల న‌గారా మోగ‌నుంది. ఈ మేర‌కు రాష్ట్ర ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ ఏయే మున్సిపాలిటీల‌లో ఎన్నిక‌లు జ‌రుగుతాయో ఆయా  తేదీల‌ను కూడా ప్ర‌క‌టించింది.

ఇందులో భాగంగా రాష్ట్రంలోని తొలిసారిగా మున్సిపాలిటీ నుంచీ కార్పొరేష‌న్ స్థాయికి చేరిన విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌ద్యంలో అందుకు సంబంధించి ఏర్పాట్ల‌ను..జిల్లా క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో క‌లెక్ట‌ర్ డా.హ‌రిజ‌వ‌హ‌ర్ రాల్ తెలిపారు.

మొత్తం జిల్లా కేంద్రంలో 50 డివిజ‌న్ల‌తో విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌రుగ‌గా.. బొబ్బిలి 31 వార్డులు,పార్వ‌తీపురం 30 వార్డులు, సాలూరు 29 వార్డులు, మేజ‌ర్ పంచాయితీగా నెల్లిమ‌ర్ల‌లో 20 వార్డులు క‌లిపి మొత్తం 160 వార్డుల‌లో వ‌చ్చే నెల 10న  మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గుతాయ‌ని క‌లెక్ట‌ర్ డా. హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు.

మొత్తం 3 ల‌క్ష‌ల 43 వేల 841 ఓట‌ర్లు త‌మ  ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నార‌ని… విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ లో 2 ల‌క్ష‌ల 2 వేల 214 మంది, బొబ్బ‌లి 45 వేల 967,పార్వ‌తీపురం 37 వేల 690,సాలూరు 39 వూల 172,నెల్లిమ‌ర్ల 18 వేల 798 మంది ఓట‌ర్లు త‌మ ఓటు  హ‌క్కును వినియోగించుకోనున్నార‌ని జిల్లా కలెక్ట‌ర్ తెలిపారు.

అదే విధంగా ఈ మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు సంబందించి  441 మంది ప్రిసైడింగ్ అధికారులు, 382 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పాల్గొంటున్నార‌ని తెలిపారు.ఒక మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌లో ప్రచార ఖ‌ర్చు నిమిత్తం ఒక్కొ అభ్య‌ర్ది,,, 2 ల‌క్ష‌ల‌కు మించి ఖ‌ర్చు పెట్ట‌రాద‌న్నారు.

ఒక్క విజ‌య‌నగ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లో మాత్రమే ఎన్నిక‌ల‌లో పోటీ చేసే అభ్య‌ర్ధి….2 ల‌క్ష‌లు వ‌ర‌కు ఎన్నికల ఖ‌ర్చు పెట్టొచ్చ‌న్నారు.ఇక బొబ్బిలి,పార్వ‌తీపురం,సాలూరుల‌లో ల‌క్షా 50 వేలు ఖ‌ర్చు పెట్టొచ్చ‌న్నారు.

నెల్లిమ‌ర్ల గ్రామ పంచాయితీ లో మాత్రం ల‌క్ష రూపాయ‌లు మాత్ర‌మే ఖ‌ర్చు పెట్టాల‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు.ఇక ఎన్నిక‌ల నియ‌మావ‌ళికి సంబంధించి..విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ చైర్మ‌న్ గా బీసీ మ‌హిళ‌, బొబ్బిలి పుర‌పాక‌ల సంఘానికి బీసీ జ‌న‌ర‌ల్, పార్వ‌తీపురం కు బీసీ మ‌హిళ‌, సాలూరు మున్సిపాలిటీకి జన‌ర‌ల్ మ‌హిళ‌, నెల్లిమ‌ర్ల అతి పెద్ద గ్రామ పంచాయితీకి ఎస్సీ మహిళ‌ను సంబంధిత వార్డు మెంబ‌ర్లుగా ఎన్నికైన వారి ద్వారా ఎన్నుకోబ‌డ‌తార‌ని జిల్లా క‌లెక్ట‌ర్ తెలిపారు.

Related posts

బీఎండబ్ల్యూ కారు అందుకున్న పి వి సింధు

Satyam NEWS

శ్రీశైలం మహా క్షేత్రంలో అసెంబ్లీ స్పీకర్

Satyam NEWS

బద్వేల్ ఉప ఎన్నికల్లో నేను పోటీ చెయ్యడం లేదు

Satyam NEWS

Leave a Comment