27.7 C
Hyderabad
April 30, 2024 08: 51 AM
Slider సినిమా

విజయనగరం లో అల్లు అర్జున్ పుట్టినరోజు:”గని” విడుదల వేడుకలు

#alluarjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ,అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించి,నిర్మించిన గని సినిమా విడుదల సందర్బంగా ఏపీలోని విజ‌య‌న‌గ‌రంలోని లీలామహల్ థియేటర్ లో ఘనంగా వేడుక‌లు నిర్వ‌హించింది… విజయనగరం జిల్లా చిరంజీవి యువత.ఈ మేర‌కు విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన పార్టీ నేత‌ త్యాడ రామకృష్ణారావు(బాలు)  ముందుగా లీలామహల్ థియేటర్ మేనేజర్ సత్యనారాయణ చేతులు మీదుగా కేక్ ను కట్ చేసి వేడుకలు ప్రారంభించారు.

ఈ మేర‌కు మేనేజర్ సత్యనారాయణను  జిల్లా చిరంజీవి యువత సత్కరించారు. ఈ సందర్బంగా జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ మా అందరి ఆరాద్య‌దైవ‌మైన‌ చిరంజీవి,నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల‌ను  ఆదర్శంగా తీసుకొని ప్ర‌జా సేవల్లో ముందుకు వెళుతున్నామ‌ని, వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాటమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.

ఈ సందర్బంగా ఈ మధ్యనే కృష్ణా థియేటర్ మేనేజర్ మామిడి పరుశరామ్ కు శివాలయమ్ వీధిలో ఉన్న శివాలయం ఆలయ కమిటీ సభ్యునిగా అయ్యినందుకు జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో కృష్ణా థియేటర్ లో ఆయ‌న‌ను సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా చిరంజీవి యువత, జనసేన నేత‌లు ,అల్లు అర్జున్ అభిమాన సంఘం అధ్యక్షులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్,జనసేన యువనాయకులు లోపింటి కళ్యాణ్,చెల్లూరి ముత్యాల నాయుడు,జిల్లా చిరంజీవి యువత గౌరవ సలహాదారులు సారికి మురళి మోహన్, సభ్యులు సాయి,అప్పన్న,లంకాపట్నం కుమార్, సూరిబాబు, ఉదయ్, పైడిరాజు,జి. సురేష్, రవి, కులదీప్, కొమ్మాజీ సాయిప్రకాష్, అరవింద్,పిల్లి సతీష్, బెలగాన చందు, చందక రాజారావు, అలబోయిన శివ,మదన్,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గుడ్ వర్క్: కరోనా వైరస్ పై పిల్లలకు అవగాహనా కార్యక్రమం

Satyam NEWS

దేశాన్ని ఏకం చెయ్యడమే రాహుల్ యాత్ర లక్ష్యం

Murali Krishna

బిచ్కుందలో ఘనంగా గణతంత్ర వేడుకలు

Satyam NEWS

Leave a Comment