37.2 C
Hyderabad
April 30, 2024 13: 49 PM
Slider నిజామాబాద్

గుడ్ వర్క్: కరోనా వైరస్ పై పిల్లలకు అవగాహనా కార్యక్రమం

carona virus

కరోనా(కోవిడ్-19) వైరస్ గురించి బిచ్కుంద మండలంలో వివిధ పాఠశాలలో అవగాహన సదస్సులను నిర్వహించారు. కామారెడ్డి డిఎంహెచ్ఓ, బాన్సువాడ డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆరోగ్య బోధకుడు దస్థిరాం, సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, ఇంతియాజ్ అలీ తెలిపారు.

బిచ్కుంద జిల్లా పరిషద్ బాలికల ఉన్నత పాఠశాల ZPHS BOYS, ZPHS ఉర్దూ మీడియం, KGBV పాఠశాలలో లో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమములో పాఠశాల ప్రిన్సిపాల్,  ఉపాధ్యాయులు పిల్లలు, స్థానిక ANM లు ఫ్లోరెన్స్, గంగామని, బాలమని తో పాటు ఆశలు పాల్గొన్నారు.

కరోనా వ్యాధి లక్షణాలపై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. తలనొప్పి, జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఛాతి నొప్పి, ఆయాసం రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యుడిని సంప్రదించాలని చెప్పారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని వారు తెలిపారు.

చేతులు ఎప్పటికప్పుడు శుభ్రముగా కడుక్కోవాలని, ఇతరులకు అపరిచిత వ్యక్తులకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని పిల్లలకు అవగాహన కల్పించారు. నోటి తుంపరులు పడకుండా మాస్క్ ధరించాలి, చల్లని ఆహారం, ఫ్రిజ్ లోని ఆహారం, ఐస్ క్రీమ్ తినకూడదు, బహిరంగ ప్రదేశాల్లో, జన సందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడదు, గొంతు నొప్పి ఉంటే గోరు వెచ్చని నీటిలో ఉప్పు , చిటికెడు పసుపు వేసి పుక్కిలించాలి లాంటి అంశాలను తెలుపుతూ అవగాహన కల్పించారు.

Related posts

మైనార్టీ సెల్ నాయకుడికి లోకేష్ పెళ్లి కానుక

Sub Editor

రెడ్ హ్యాండెడ్: నలుగురు గుట్కా స్మగ్లర్ల అరెస్ట్

Satyam NEWS

“కంటెంట్” నిర్మాతల పాలిట “కల్పతరువు”: ప్రొడ్యూసర్ బజార్

Satyam NEWS

Leave a Comment