39.2 C
Hyderabad
May 3, 2024 14: 01 PM
Slider ప్రత్యేకం

కేంద్ర వైఖరితో ఆర్టీసీకి నష్టాలు

rtc

మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు ఉంది ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థను చక్కబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసిఆర్ ఆదేశాలతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో ఆర్టీసీ యాజమాన్యం అహర్నిశలు కృషి చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరితో తాజాగా బల్క్ యూజర్లకు పెరిగిన క్రూడాయిల్ ధరలతో మరింత అదనపు భారం పడింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో దేశంలో బల్క్ యూజర్లపై ఆ భారం పడింది. తెలంగాణ ఆర్టీసీపైనా అదనపు భారం పడింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు 40 శాతం పెరగడంతో- బల్క్‌ యూజర్లకు ఇచ్చే ఇంధనం ధర పెంచేశారు. బల్క్ యూజర్లు అంటే ఆర్టీసీ, మాల్స్‌, ఎయిర్‌పోర్టులు వంటి పలురంగాల సంస్థలు ఉంటాయి. వీళ్లు సాధారణంగా నేరుగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి డీజిల్‌ను కొనుగోలు చేస్తారు. వీటికి తోడు ఇప్పుడు డీజిల్ రేట్లను పెంచుతూ చమురు సంస్తలు నిర్ణయం తీసుకున్నాయి.

బయట మార్కెట్‌లో ధరతో పోల్చితే ఆర్టీసీ ప్రత్యేక బంక్ లలో తక్కువకు లభించే డీజిల్, పెరిగిన ధరలతో బయట మార్కెట్ తో పోల్చితే 7.38 రూపాయల యెక్కువకు  ఆర్టీసీ బంక్‌లో డీజిల్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌‌లో డీజిల్ ధర 95.49 రూపాయలు. కాగా పెరిగిన బల్క్ యూజర్ మార్కెట్ డీజిల్ ధర 102 రూపాయలకు పైనే వుంది. అంటే దాదాపు ఏడు రూపాయలకు పైనే ఉంది. దాదాపు తెలంగాణ ఆర్టీసీ బస్సులు రోజుకి 33లక్షల కిలోమీటర్ల ప్రయాణానికి 8లక్షల లీటర్ల డీజిల్ అవసరం. 102 రూపాయలు బల్క్ యూజర్ మార్కెట్‌లో ఉండడంతో బయట మార్కెట్‌లో డీజిల్ వాడకం పెరిగింది. దీనితో లీటర్ డీజిల్‌కు ఏడూ రూపాయలు, బయట మార్కెట్‌లో ఆర్టీసీ బస్ డీజిల్ తీసుకోవడం వల్ల కమిషన్‌ల కింద లీటర్‌కు మరో నాలుగు రూపాయలు. మొత్తంగా లీటర్ డీజిల్‌కు 12 రూపాయల నష్టం తెలంగాణ ఆర్టీసీ భరిస్తుంది. అంటే దాదాపు తెలంగాణ ఆర్టీసీకి రోజుకి కోటి వరకు నష్టం.

ఈ పెరిగిన బల్క్ యూజర్ల క్రూడాయిల్ ధరల వల్ల అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఇలా ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారని అంటున్నారు ఆర్టీసీ కార్మికులు. ఓ వైపు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ నష్టాల్లో ఉన్న ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకునేందుకు కృషి చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలను తప్పుపడుతూ ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

మహిళా వైద్య సిబ్బందికి సన్మానం

Satyam NEWS

యూకె స్ట్రెయిన్ భయంకరమైనది కాదు

Sub Editor

యువ తెలంగాణ పార్టీ కార్యాలయం ప్రారంభం

Sub Editor

Leave a Comment