40.2 C
Hyderabad
April 28, 2024 18: 29 PM
Slider ఆధ్యాత్మికం

కార్తీక మాసం: పరమ పవిత్రమైన శ్రీ అమరేశ్వరస్వామి ఆలయం

#amareswaraswamytemple

పల్నాడు జిల్లా లో కృష్ణ నదీ తీరంలో అమరావతీ గ్రామంలో పరమ పవిత్రమైన శ్రీ అమరేశ్వరస్వామి ఆలయం విరాజిల్లుతున్నది. ఐదు ఆరామాలలో ఒక ఆరామం ఈ అమరావతి. అమరావతిలో పడిన శివలింగాన్ని ఇంద్రుడు జించి ప్రతిష్టించి ఒక ఆలయమును నిర్మించాడు అదే ఈ అమరేశ్వరస్వామి ఆలయము గా ప్రసిద్ధి చెందినది. ఇది చాలా ప్రాచీనమైన ఆలయం. నాల్గువైపులా మహోన్నతమైన గోపురాలతో విరాజిల్లే ఆలయం శ్రీ అమరేశ్వర స్వామి నిలయం.

చారిత్రాత్మక ప్రసిద్ద పౌరాణిక పుణ్యస్థలం ఈ అమరావతి. కృష్ణ వేణి నదీ తీరాన త్రినేత్రుడైన స్వామి వారు మూడు గొప్ప ప్రాకారములతో నిర్మించిన మహాక్షేత్రములో కొలువుదీరి భక్తుల కోరిన కొర్కెలు తీర్చే అమరేశ్వరుడి గా కొలువై వున్నాడు. పూర్వము తారకుడనే రాక్షసుడు శివ పరమ భక్తుడు. ఆ భక్తి తో శివుడిని మెప్పించి వరముగా ఆత్మలింగాన్ని పొందాడు. ఆ ఆత్మలింగాన్ని ధరించి అతడు బలగర్వముతో మానవులను, దేవతలను హింసించ సాగాడు. ఆ హింసలను భరించలేక దేవతలు పరమ శివుడు దగరకు వేళ్లి ప్రార్ధించగా శివుడు వారి కోరిక మేరకు, తన కుమారుడైన కుమార స్వామి (సుబ్రమణ్య స్వామి) ని తారకాసురుడిని వధించి రమ్మని చెప్పి పంపుతాడు. తండ్రి ఆజ్ఞానుసారం కుమార స్వామి వెళ్ళి తారకాసురుని ఎదిరిస్తాడు. ఇరువురి మద్య ఘోరమైన యుద్దం జరిగింది. కుమారస్వామి ప్రయోగించే అస్త్రాలన్నీ విఫలమౌతుండగా అది శివుని ఆత్మలింగ మహత్యంగా భావించిన కుమారస్వామి శివుని ప్రార్దించి ఒక దివ్యమైన అస్త్రాన్ని పొందాడు.

ఆ అస్త్రము తో తారకాసురుడు ధరించిన ఆత్మ లింగాన్ని కుమారస్వామి 5 ముక్కలుగా ఛేదిస్తాడు. ఆ ఐదు ముక్కలు చెదిరి ఐదు వేరు వేరు స్థలములలో పడ్డాయి. ఆ శివలింగం ముక్కలు పడిన చోట్ల ఆరామాలుగా పేరు పొందాయి. అమరావతి కూడా అందులో ఒకటి. ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు గాలిగోపురాలు వున్నాయి. తూర్పు వైపు గాలిగోపురం నుండి 20 గజాల దూరంలో కృష్ణ ప్రవాహానికి వెళ్ళే దారి ఉంది. కొండవీటి రెడ్డి రాజులపై విజయోత్సాహంతో 1517 లో ఈ చారిత్రక ప్రాంతాన్ని కృష్ణ దేవరాయులు ఇక్కడి అమరేశ్వరునికి మహా పూజలు చేశాడు. పెదమద్దూరు గ్రామ పంట భూములన్నీ ఆలయానికి దానము ఇచ్చినట్లు గా ఇక్కడ ఉన్న రాజా శాసనం ద్వార తెలుస్తుంది . ఇక్కడ శ్రీ కృష్ణ దేవారాయలు తులాభారం తూగారు. తన బరువుతో సమానమైన బంగారాన్ని పేదలకు పంచి పెట్టి నట్టు గా ఆ సనములో తెలుస్తుంది. అందుకు గుర్తు గా శ్రీ రాయలవారు నిర్మించిన తులాభారము అనే పేరుగల మండపము , దాని ముందు వేయించిన శాసనము నేటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తాయి. ఇది ఈ ఆలయములో ని దక్షిణ రెండో ప్రాకారాలలో వుంది.

ఈ ఆలయానికి మూడు ప్రాకారాలు వున్నాయి. వానిలో 1-2 ప్రాకారాల మద్య మహిషాసురమర్దిని , కౌసలేశ్వరస్వామి , వీరభద్రస్వామి , కాశీ అన్నపూర్ణే అమ్మవారు , పరణవేశ్వరుడు , దత్తాత్రేయుడు , అమరేశ్వరుడు , జ్వాలాముఖి అమ్మవారు , పార్దికేశ్వరుడు , సోమేశ్వరుడు మొదలైన దేవతామూర్తులు వున్నారు. 2-3 ప్రాకరములలో విఘ్నేశ్వరుడు , కృష్ణ దేవరాయుల తులభారము , నాగ మండపము , కాలభైరవుడు , కుమారస్వామి , ఆంజనేయస్వామి , యాగశాల , నవగ్రహములు మొదలయినవి . వున్నాయి వాటిని మనము దర్శించుకొవొచ్చును .

ఈ అమరావతిలో శివలింగము చాలా పెద్దది , ఇది ఆత్మలింగము కావడము వలన రోజు రోజుకి పేరిగిపోవడముతో ఇంద్రుడు ఆత్మలింగమునకు పరిహరార్దము అర్చనలు , పంచామృతములతో అభిషేకములు , పూజలు చేసి స్వామి వారిని శాంత పరిచినారు. అప్పటి నుండి మామూలు స్థానములో నే వుంది . పెరగలేదు … ఈ లింగము 3 అడుగులు చుట్టుకొలత, 60 అడుగుల ఎత్తు వుంటుంది . … సతెైనపల్లి,క్రోసూరు గుంటూరు,మంగళగిరి,విజయవాడ,వగైరా నుంచి బస్సు సౌఖర్యములు ఉన్నాయి.

ఎం ఎస్ సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా

Related posts

బంజారాహిల్స్ పోలీసులపై మత్తులో ఉన్న యువ‌తి దాడి

Satyam NEWS

కువైట్ నందమూరి సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ

Satyam NEWS

Breaking News: శ్రీలంకలో తలెత్తిన రాజకీయ సంక్షోభం

Satyam NEWS

Leave a Comment