42.2 C
Hyderabad
April 30, 2024 15: 14 PM
Slider విజయనగరం

అస్పృశ్యత, అంటరానితనం, రెండు గ్లాసుల విధానంపై పోరాటం…!

#vijayanagarambjp

విజ‌య‌న‌గ‌రం  బీజేపీ ఆధ్వ‌ర్యంలో అంబే వాడేక‌ర్ 131  వ జ‌యంతి ఉత్స‌వం….!

అంబేద్క‌ర్ అస‌లు పేరు అంబే వాడేక‌ర్…స‌రిగ్గా  ఇలాగే అంబేద్క‌ర్ ను పిల‌వాలంటూ ఎక్క‌డ..ఎవ్వ‌రూ చెప్పలేదు.కానీ  భార‌తీయ జ‌న‌తా పార్టీ…త‌న పుస్త‌కాల‌లో మీటింగ్ ల‌లో చెప్పే అస‌లైన పేరు అంబేవాడేక‌ర్ అని… స‌రిగ్గా అంబేద్క‌ర్ జ‌యంతి రోజునే బీజేపీ..అస‌లైన పేరును ప్ర‌స్తావించింది.

ఈ మేర‌కు ఏపీలోని విజ‌య‌న‌గరం జిల్లా బీజేపీ  శాఖ‌… డాక్టర్ భీమ్ రావు అంబే వాడేక‌ర్ 131 వ జయంతిని పురస్కరించుకొని స్థానిక విజయనగరం బాలాజీ జంక్షన్ లోఆయ‌న‌ విగ్రహానికి పూల మాల‌లు వేసారు.. ఆ పార్టీ  జిల్లా అధ్యక్షులు   రెడ్డి పావని.

ఈ సందర్భంగా  రెడ్డి పావని  మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. డాక్టర్ అంబేద్కర్ అంటరానత‌నానికి కి వ్యతిరేకంగా బలమైన ఉద్యమం చేస్తూ ఎలాంటి వివక్షకు తావు లేని సమాజాన్ని నిర్మించారన్నారు.

తన బాల్యంలో, యవ్వనంలో అనేక రకాలైన వివక్షకు గురైనా మొక్కవోని దీక్షతో, తనదైన శైలితో ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించారన్నారు. భారత స్వాతంత్రం కొరకు మహాత్మాగాంధీ ఎలా నడుంకట్టారో, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  కూడా సామాజిక, సమసమాజ స్వాతంత్ర్యం కోరుకున్నార‌న్నారు.

సమాజంలో బలంగా వేళ్లూనుకున్న అస్పృశ్యత, అంటరానితనం, రెండు గ్లాసుల విధానం లాంటి. ఇలాంటి వేర్పాటు,, ఎడబాటు భావాలు లేని సమసమాజ స్వాతంత్ర్యాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోరుకున్నార‌ని రెడ్డి పావ‌ని అన్నారు.. కేవలం రాజకీయ స్వాతంత్ర్య‌మే కాకుండా అణ‌గారిన వర్గాల లో ఈ దేశం నాది అనే భావన లేకపోతే స్వాతంత్ర్యం వచ్చినా ప్రయోజనం లేదని భావించారని రెడ్డి పావని అన్నారు..

సమాజంలో అస్పృశ్యత, అంటరానితనంపై రాజీలేని పోరాటం చేసి సమాజ ఐక్యతకు పునాది వేసిన మహా మనిషి డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్.అని అన్నారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తీగల హరనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి  బగ్గం రాజేష్, కట్టా బాబు,బూర జగ్గారావు,తాడి నానాజీ,ఇమంది సుదీర్, ఇప్పిలి గోపాలకృష్ణ, పసుపు నాటి గిరిబాబు, సోము మహేష్, అబ్దుల్ ఆదిల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పాలకుర్తి కేంద్రంగా దేవాలయాలతో టూరిజం హబ్ అభివృద్ధి

Bhavani

ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ప్రికాష‌న్‌ డోస్ కు అనుమ‌తించండి

Satyam NEWS

హుజూర్ నగర్ గ్రంథాలయ నూతన కమిటీ నియామకం

Satyam NEWS

Leave a Comment