Slider హైదరాబాద్

హిందూ స్మశాన వాటికలో పీడిస్తున్న నీటి కొరత

#Amberpet Burial Ground

హైదరాబాద్ మహానగరంలో అత్యంత ముఖ్యమైన అంబర్ పేట్ లోని మోహన్ చెరువు స్మశానవాటికలో బోరింగ్ పాడైపోయి పదిహేను రోజులు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. జలమండలి అధికారులు గాని, ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోకపోవడం అత్యంత దారుణమైన విషయంగా పలువురు విమర్శిస్తున్నారు.

దీంతో ఇక్కడికి  అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చేవారు స్నానాలు చేయడానికి, కాళ్ళు కడుక్కోవడానికి నానా ఇబ్బంది పడాల్సి వస్తుంది. బోరు పనిచేయక నీటి ఎద్దడి తో అవస్థలు పడుతున్న ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో అంత్యక్రియలు జరిగినప్పుడు ప్రజలు ట్యాంకర్ నీటిని కొన్ని తీసుకురావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రతినిత్యం ఇక్కడ పదుల సంఖ్యలో అంత్యక్రియలు జరుగుతుండడంతో నీటికోసం తల్లడిల్లుతున్న పరిస్థితి నెలకొంది. ఈ విషయమై స్మశాన కమిటీ కూడా పట్టించుకోవడం లేదు. ఒక్కో అంత్యక్రియలకు ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్న కమిటీ బోరింగ్ మరమ్మతు విషయంలో పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Related posts

నేర చరిత్ర ఉన్న వారికి టికెట్లు ఇవ్వొద్దు

mamatha

మానవ నిత్య జీవితంలో సైన్స్​ పాత్ర ఎంతో ఉంది

Murali Krishna

వామపక్షాల బంద్:విజయవాడలో సిపిఐ నేతల అరెస్టు

Satyam NEWS

Leave a Comment