29.7 C
Hyderabad
May 2, 2024 06: 42 AM
Slider ముఖ్యంశాలు

నాటి మంత్రుల శిలాఫలకాలు..నేటి మంత్రుల ప్రారంభోత్సవాలు…

#kollapurhospital

కరోనా సమయంలో నాగర్ కర్నూల్ జిల్లాలో 50 పడకల మాత శిశు ఆరోగ్య కేంద్రం అందుబాటులో రావడం కొల్లాపూర్ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గత 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కొల్లాపూర్ ప్రజలకు అత్యవసర వైద్యం అందించడానికి, తల్లి,బిడ్డలకు సురక్షితమైన  వైద్యం అందించడానికి అప్పటి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ కు మంజూరు చేయించారు.

అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తో శిలాఫలకాన్ని  ప్రారంభించారు. అయితే మూడేళ్ల తర్వాత ప్రస్తుతం నిర్మాణం పూర్తి కావడంతో మంగళవారం  మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రస్తుత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  ప్రారంభించారు. కొల్లాపూర్ లోని రామాపురం గ్రామ సమీపంలో నిర్మించిన ఆసుపత్రిని ఎంపీ రాములు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొల్లాపూర్ శాసన సభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి తో కలసి ఆయన ప్రారంభించారు.

కొల్లాపూర్ కు డయాలసిస్ కేంద్రం మంజూరు

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అన్ని వసతులు, సిబ్బందితో  ఈ రోజు మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో సకల సౌకర్యాలతో ఈ ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకలకు స్థాయి పెంపొందిస్తామని అన్నారు. అదేవిధంగా కొల్లాపూర్ కు డయాలసిస్ సెంటర్ మంజూరు చేయనున్నట్లు తెలిపారు.  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తగా 3 మెడికల్ కళాశాలలు మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

త్వరలో వాటిని ప్రారంభిస్తామన్నారు. తద్వారా ప్రజలకు వైద్య పరంగా అనేక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.  తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇందులో భాగంగా  ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో వైద్య పరంగా ఆసుపత్రులు, వైద్య సిబ్బంది, వైద్య పరికరాలు సమకూరుస్తామని అన్నారు.

వచ్చే సంవత్సరం నుండి రాష్ట్రంలో  మన ఊరు మన బడి కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. ఇందులో భాగంగా అన్ని చోట్లా ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభిస్తామనన్నారు. దీనికోసం అన్ని పాఠశాలలకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నామని మంత్రి తెలిపారు.

కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ  పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు .దీనికోసం 7280 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు నిధులు సమకూర్చుకుంటున్నామని తెలిపారు. పాఠశాలను రెండు దశల్లో అప్గ్రేడ్ చేస్తామన్నారు. ఏ మంచి పని చేసినా ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని, పేద ప్రజలకు ఆంగ్ల మాధ్యమం ద్వారా విద్యను అందిస్తామంటే గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో  కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, సాయిచంద్,  జిల్లా పరిషత్ చైర్మన్ పద్మావతి,  ప్రభుత్వ  విప్ కుచుకుళ్ల దామోదర్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్, ఎమ్మెల్సి కసి రెడ్డి నారాయణ రెడ్డి,  కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, నాగర్ కర్నూల్ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి, అదనపు కలెక్టర్ మను చౌదరి,     ఆర్డీఓ హనుమ నాయక్,  జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సుధాకర్ లాల్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా మహమ్మారితో మధుమేహ రోగులకు పెనుముప్పు

Satyam NEWS

ఉజ్జయినిలో శ్రీ మహాకాల్ లోక్‌ ప్రారంభం

Satyam NEWS

నోరులేని జీవాల అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు

Satyam NEWS

Leave a Comment