38.2 C
Hyderabad
May 3, 2024 20: 24 PM
Slider మహబూబ్ నగర్

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మునిసిపల్ చైర్మన్

#BloodDonationCamp

కల్వకుర్తి పట్టణంలోని లైన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్ గల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఆయన కూడా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ప్రాణదాతగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం  అంటారని , ప్రమాదాలలో దెబ్బలు తగిలి రక్తం బాగా పోయినప్పుడు సర్వసాధారణంగా ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడతారు.

కాగా ప్రమాదాలలో పోయిన రక్తంతో పాటు ఆపరేషన్లో కూడా కొంత రక్తస్రావం జరుగుతుందని అటువంటి సమయంలో రక్తం ఎక్కించవలసిన పరిస్థితి రావొచ్చని రక్త దాతలు ఇచ్చిన రక్తాన్ని వారికి ప్రాణం పోస్తుందని  సూచించారు.

ప్రతి వ్యక్తి  రక్తదానం చేసినచో ఇతరుల ప్రాణాలు నిలబెట్టడమే కాక తన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 

ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సభ్యులు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వారసత్వ కట్టడాలకు కాలం చెల్లినట్లేనా?

Sub Editor

మూడు రోజుల్నించి అడుగుతున్నా సీఎం కలవడం లేదు

Satyam NEWS

రైల్వే సిగ్నల్ వ్యవస్థను పెంచి ప్రమాదాల నుండి కాపాడాలి

Satyam NEWS

Leave a Comment