40.2 C
Hyderabad
April 29, 2024 16: 12 PM
Slider అనంతపురం

Way2news పై అనంతపురం పోలీసుల చర్యలు

#Way2news

అనంతపురం జిల్లాలో అమ్మాయిల మిస్సింగ్ కేసులపై తప్పుడు సమాచారం ఇచ్చిన సోషల్ మీడియా వెబ్ సైట్లపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లాలో ఈ ఏడాది” 14 రోజుల్లో 16 మంది అమ్మాయిల అదృశ్యం”… ” 14 రోజుల్లో 16 మంది అమ్మాయిలు మిస్సింగ్ … ఎక్కడ ఉన్నారు- యాడ పడుకున్నారు” అంటూ అసత్య ప్రచారం చేసిన Way2news మరియు @RamsRedchilli16 వారిపై అనంతపురం పోలీసులు చర్యలు తీసుకున్నారు.

అనంతపురం ఒన్ టౌన్ పోలీసు స్టేషన్లో Way2news మరియు @RamsRedchilli16 వారిపై క్రైం నంబర్ 25/2023 505(2) IPC and sec 74 of it act కేసు నమోదు చేశారు. నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా Way2news మరియు @RamsRedchilli16 వారు చేసిన పోస్టులను నిర్ధారించుకోకుండా తిరిగి సోషల్ మీడియాలో వాటినే పోస్ట్ చేసిన వారికి సైతం నోటీసులు అందజేయనున్నారు. ప్రజల్లో అలజడులు, ఆందోళనలు రేకెత్తేలా తప్పుడు సమాచారాలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయం హెచ్చరించింది.

Related posts

పాత్రుని వలస ఉన్నత పాఠశాలలో ట్యాబుల పంపిణీ

Bhavani

ఘనంగా ముఖ్యమంత్రి జగన్ జన్మదినం

Satyam NEWS

బతికేందుకు భయంగా ఉంది రక్షణకు రైఫిల్ ఇవ్వండి

Satyam NEWS

Leave a Comment