29.7 C
Hyderabad
April 29, 2024 07: 36 AM
Slider తెలంగాణ

తెలంగాణను ఊటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు

sabita gowd

వికారాబాద్ జిల్లా అనంతగిరిలో మూడు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో వెలసిన అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కొండపైన ఉన్న చెత్తిరి(గొడుగు), అటవీశాఖ వ్యూ పాయింట్ తాండూరు మార్గంలో ఉన్న నంది ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనంతగిరికా హవా లాఖో మరీజోంకా దవా అనే నానుడి ఉందని, ఎటువంటి రోగాలు అయినా ఇక్కడ తగ్గిపోయే వాతావరణం ఉన్నదని, అనంతగిరి ప్రాంతాన్ని తెలంగాణ ఊటీగా మార్చాలని ఆలోచన ఉన్నదని, అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సిఎం ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చామని అన్నారు. టెంపుల్ టూరిజం, వెల్ నెస్ టూరిజం, అడ్వెంచర్ టూరిజంలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. హైదరాబాద్ మహానగరానికి సమీపంలో ఉన్న అనంతగిరి కొండలు ప్రకృతి నిలయాలుగా ఉన్నాయని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతే హైదరాబాద్ ప్రజలు వేలాదిగా తరలి వస్తారని పేర్కొన్నారు. అనంతగిరిలో రోగాలు నయం అయ్యే వాతావరణం కలిగి ఉందని అన్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్లో అనంతగిరి ఊటీగా మార్చి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్,  ఎంఈ రంజిత్ రెడ్డి, జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డిలగా విజ్ఞప్తి మేరకు అనంతగిరిలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, నమ్మకం విశ్వాసానికి మారుపేరు అని పేర్కొన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీని సీఎం కేసిఆర్ నిలబెట్టుకుంటారనే విశ్వాసం ఉందన్నారు. జడ్పీ చైర్ పర్సన్ సునితామహేందర్ రెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో అనంతగిరి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెస్తే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు‌.

Related posts

బాధిత కుటుంబానికి గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ చెక్కు అందజేత

Satyam NEWS

అందుబాటులోకి యాస్ తుఫాను కంట్రోల్ రూమ్

Satyam NEWS

జర్నలిస్టు జావీద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

Bhavani

Leave a Comment