28.7 C
Hyderabad
April 27, 2024 03: 18 AM
Slider తెలంగాణ

బెంగళూరు చెన్నైతో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు

ktr delhi

హైదరాబాద్  భౌగోళికంగా దేశానికి నడిబొడ్డున ఉన్నదని, ఈ నేపథ్యంలో హైదరాబాద్- బెంగళూరు- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.  ఈ కారిడార్ ఏర్పాటు వలన అటు ఐటి రంగంలో దేశంలోనే అగ్రగామిగా నగరాలుగా ఉన్న హైదరాబాద్ బెంగళూరు, పారిశ్రామిక రంగంలో ముందు వరుసలో ఉన్న చెన్నై నగరాన్ని కలిపి ఏర్పాటు చేసే ఈ కారిడార్ ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యాపార, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కేటియార్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలపైన మాట్లాడారు. దీంతో పాటు పారిశ్రామికీకరణ మరింత వేగంగా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై పలు సలహాలు, సూచనలు  అందించారు. తెలంగాణ   టియస్ ఐ పాస్ ద్వారా మరియు ఇతర  పారిశ్రామిక విధానాల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక వర్గాలకు చేయూతని అందిస్తున్న తీరు, దీంతో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరుని తెలిపారు. దీంతోపాటు హైదరాబాద్ నగరంలో ఉన్న ఫార్మా, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగ పరిశ్రమలకు మరింత ఊతం ఇచ్చినట్లు అవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించుకున్న 14 ప్రాధన్యత రంగాల్లో పెట్టుబడులను ఏవిధంగా ఆకర్షిస్తున్నది తెలిపిన కేటిఆర్, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలకు కేంద్రం నుంచి మరింత సహకారం కావాలని కోరారు.

Related posts

22లోగా డోర్ టు డోర్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి

Bhavani

ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి

Bhavani

తల్లి పాలు బిడ్డకు మొదటి టీకాతో సమానం..

Satyam NEWS

Leave a Comment