పరిపాలనా సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఈ మేరకు ప్రాధమిక కసరత్తు కూడా పూర్తి అయింది. అందువల్ల రాష్ట్రంలో తొందరలో కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశం ఉంది. నిజానికి ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మార్చాలన్నది ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన. ఈ విషయాన్ని బహిరంగ సభల్లోనే చాలా సార్లు చెప్పారు. ఇదే విషయాన్ని తాజాగా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో జరిగిన భేటిలో చెప్పారని సమాచారం. చంద్రబాబునాయుడు హయాంలో కూడా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన వచ్చిందికానీ ఎందుకో ఆయన చేయలేదు. రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాలు ఉన్నందున అంతే సంఖ్యలో జిల్లాలను ఏర్పాటుచేయాలని ప్రతిపాదన సిద్ధం అవుతున్నది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి 26 నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయి.
previous post