సమాజంలో సేవా రంగంలో ఉన్న అంగన్వాడీ సిబ్బంది సమస్యలను తక్షణం పరిష్కరించాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందని సమ్మెను విచ్చిన్నం చేయడానికి యత్నిస్తుందని వారు ఆరోపించారు. 10 రోజులుగా సమ్మె చేస్తున్న జంగన్వాడీ సిబ్బంది కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు సిపిఐ, సిపిఎం నేతలు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వాసుపక్షాల నేతలు మాట్లాడుతూ అన్నింటిలో ముందున్న అని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం. అంగన్వాడీలకు సమకూర్చే సౌకర్యాలు, వేతనాలు ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా ఉన్న ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలకు హెల్త్ కార్డులు, ఇతర సదుపాయాలను కల్పిస్తున్నారని. మరికొన్ని రాష్ట్రాలు పదవి విరమణ తర్వాత కూడా సదుపాయాలు కల్పిస్తున్నాయని పింఛన్, పండుగ బోనస్లు ఇస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్పుకుంటూ అంగన్వాడీల విషయంలో వివక్ష పాటిస్తుందని వారు. తెలిపారు. సమ్మె పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభించడమే కాకుండా విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తుందని వారు ఆరోపించారు.
అదే పరిస్థితి కొనసాగితే అంగన్వాడీ కేంద్రాలకు రక్షణగా నిలబడతామని చామపక్ష నేతలు అంగన్వాడీలకు భరోసా ఇచ్చారు. తాళాలు వేసి బెదిరింపులకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కలెక్టర్ ఐసిడిఎస్ పిడీలకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సిపిఎం నాయకులు యర్రా శ్రీకాంత్, వై. విక్రం, ఏఐటియుసి రాష్ట్ర నాయకులు శింగు నర్సింహారావు, ఏఐటియుసి, సిఐటియు జిల్లా బాధ్యులు గాదె లక్ష్మి నారాయణ. తోట రామాంజనేయులు, తుమ్మా విష్ణువర్ధన్. కళ్యాణం వెంకటేశ్వరరావు, వివిధ ప్రజా సంఘాల బాధ్యులు సిహెచ్ సీతామహాలక్ష్మి, కోటీశ్వరి, సుభా. రాధా, నాగమణి, పాపారాణి, బేబీరాణి, పద్మ, నిర్మల, రమా, చానా పద్మ, అచ్చమాంబ, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ రామ్మూర్తి, జిల్లా నాయకులు దుగ్గి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.