40.2 C
Hyderabad
May 2, 2024 17: 34 PM
Slider విజయనగరం

మరో సారి అట్టుడికిన విజయనగరం కలెక్టరేట్ ప్రాంగణం…!

#vijayanagaram

విజయనగరం జిల్లా కలెక్టరేట్ మళ్ళీ దద్దరిల్లింది. నిన్న అంగన్ వాడీలు, టీచర్స్ ఆందోళన చేస్తే….ఈ రోజు విద్యార్ధిని, విద్యార్థుల ఆందోళన, ధర్నా తో అట్టుడికింది. కేవలం ఇరవై మంది కి పైగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆప్ ఇండియా(ఎస్.ఎఫ్.ఐ)…ఖాకీ లను అల్లాడించారు. తొలుత పదిన్నర ప్రాంతంలో కలెక్టరేట్ అవుట్ గేట్ వద్ద..ప్రభుత్వ హాస్టల్లో కనీస వసతులు కొరవయ్యాయని..హాస్టల్లో మెస్ చార్జీల అంతంత మాత్రమే పెంచారని… వంటి డిమాండ్లతో ఎస్.ఎఫ్.ఐ ధర్నా చేపట్టింది.

విద్యార్ధిని, విద్యార్థుల తో ధర్నా కు దిగిన ఎస్.ఎఫ్.ఐ..చేస్తున్న ధర్నా స్ధలాన్ని మార్పు చేస్తూ కలెక్టరేట్ ఎదురుగా విశాఖ-సాలూరు రోడ్ ను దిగ్బంధిస్తూ..నడి రోడ్ పై ఉపక్రమించారు. అప్పుడు పోలీసుల్లో కాస్త వేగం పుట్టుకొచ్చి..వన్ టౌన్ ఎస్ఐ లు రామ్ గణేష్, మురళీ లు…స్టూడెంట్స్ ఆందోళన లను చెదరగొట్టే యత్నం చేశారు. లాభం లేకపోవడంతో… విజయనగరం వన్ టౌన్ ఇంచార్జ్ సీఐ విజయానంద్ ,రూరల్ సీఐ తిరుపతి రావు..ఎస్ఐ గణేష్, షేక్ శంకర్ లతో పాటు వన్ టౌన్ ఎస్ఐ భాస్కరరావు, గోపాల్ లు కూడా రంగంలో కి దిగారు. ఇక లాభం లేదని…సాక్షాత్తు విజయనగరం డీఎస్పీ గోవింద్ రావు నేరుగా రంగంలో కి దిగారు.

దీనికి తోడు నలుగురు మహిళా కానిస్టేబుల్స్ కూడా స్టూడెంట్స్ ను అక్కడ నుంచే అలాగే వారు చేస్తున్న ధర్నా ను భగ్నం చేసేందుకు రంగంలో కి దిగారు. ఒకానొక సందర్భంలో పోలీసులు తీసుకెళ్లే వాహానంకు అడ్డుగా భైఠాయించి.. భీష్మించుకుని అక్కడే ధర్నా చేసారు. ఆ సమయంలో సీఐలు విజయానంద్, తిరుపతి రావు…తమ ,తమ యూనిఫామ్ విశ్వరూపం చూపించారు. అయితే విద్యార్ధినీలు ఉండటంతో వెనక్కి తగ్గి..మహిళా పీసీలను రంగంలో కి దించి… విద్యార్ధీలను బలవంతంగా లాక్కును వెళ్లి… తెచ్చిన ఆటోలో, ట్రాలీలో పడేయడం తో ఎస్ ఎఫ్.ఐ ఆక్షేపిస్తోంది.ఎట్టకేలకు దాదాపు మూడు గంటల సేపు….అటు స్టూడెంట్స్, ఇటు ఖాకీల మధ్య జరిగిన ఆందోళన.. చివరకు డీఎస్పీ ఆధ్వర్యంలో సర్కిల్ పోలీసులు…ఎట్టకేలకు ఆందోళనలను కట్టడి చేశారు.

Related posts

గజ్వేల్ లో మున్నూరు కాపు మహాసభ సమావేశం

Satyam NEWS

రాఫెల్ ఫైటర్ జెట్ ల కొనుగోలులో ముడుపులు?

Satyam NEWS

కరోనాపై పోరాటానికి కొమ్మూరి విరాళం రూ. లక్ష

Satyam NEWS

Leave a Comment