28.7 C
Hyderabad
April 26, 2024 09: 59 AM
Slider వరంగల్

అమ్మ వృద్ధాశ్రయం సందర్శించిన ట్రిబ్యునల్ బెంచ్ మెంబర్ అనితా రెడ్డి

కాజీపేట పరిధిలో ని అమ్మ వృద్రాశ్రమం నిర్వహకురాలు రాచమల్ల శ్రీదేవిపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఆమె చేసిన నేరాలు రుజువు కావడంతో జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వుల తో చంచల్ గూడ కారాగారానికి తరలించారనే సమాచారము తెలిసికొని, శ్రీదేవి నడుపుతున్న అమ్మవృద్రాశ్రమం లోని వృద్ధుల కేర్ ఆండ్ ప్రొటెక్షన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఉమెన్ అండ్ చైల్డ్, సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ DWO సబితా, సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ బెంచ్ మెంబర్ డాక్టర్ అనితా రెడ్డి అమ్మ వృద్రాశ్రమం సందర్శించారు.

అక్కడ వృద్ధులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించి అక్కడ ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు దైర్యం చెప్పారు. తాము సేకరించిన పూర్తి ఎంక్వంరీ రిపోర్ట్ ను కలెక్టర్ కి తెలియచేసి వారి ఆదేశాల తో చట్ట ప్రకారం ఈ ఆశ్రయంలోని వృద్ధులకు తగిన నాయం చేస్తామని, వృద్ధులను ఆదుకుంటామని భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. వృద్ధుల పట్ల కలెక్టర్ రాజీవ్ గాందీ హనుమంతు చాలా బాధ్యతగా, సానుకూలంగా, మానవత్వం తో వ్యవహరిస్తారు అని DWO సబితా, డాక్టర్ అనితా రెడ్డి తెలియచేసారు. వృద్ధులను అప్పడి వరకు జాగ్రత్తగా చూచు కోమని సిబ్బంది కి తెలియచేసారు. ఏ సమస్య ఉన్న వెంటనే తమకు తెలియమని అనితా రెడ్డి, సబితా సెల్ నెంబర్లు వారికి ఇచ్చారు. ఆశ్రమాలు నడిపే ప్రతి ఎన్. జి. ఓ లు ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ నడపాలని లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసి వస్త్తుందని అన్నారు.

Related posts

విచ్ఛిన్నకారులకు వ్యతిరేకంగా కవులు ముందుకు కదలాలి

Satyam NEWS

నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కృషి చేస్తా

Satyam NEWS

వైభవంగా తుంగభద్ర పుష్కర పూజలు ప్రారంభించిన పీఠాధిపతి

Satyam NEWS

Leave a Comment