38.2 C
Hyderabad
April 28, 2024 21: 08 PM
Slider ఖమ్మం

అన్నదానం, ఆటల పోటీలు

#sandra

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణ మహోత్సవo ఆలయ అర్చకుల సమక్షంలో శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య స్వామివారిని దర్శించుకున్నారు. కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా గ్రామస్తులు నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి పురుషుల కబడ్డీ పోటీలను జెండా ఆవిష్కరించి వెంకటవీరయ్య  ప్రారంభించి  పోటీదారులకు శుభాకాంక్షలు తెలిపారు. కబడ్డీ పోటీలలో భాగంగా 6 7 8 తేదీల్లో 10 జట్టు పోటీదారులు పాల్గొంటున్నట్లు ఎనిమిదో తేదీ నాడు బహుమతుల ప్రథోత్సవానికి మంత్రులు, ఎంపీలు, జిల్లా ప్రజా ప్రతినిధులు విచ్చేస్తున్నట్లు ఎమ్మెల్యే సండ్ర తెలిపారు.  అనంతరం ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, అన్నదాన విరాళాల హుండీలో విరాళాన్ని సమర్పించారు. ప్రాచీన చరిత్ర కలిగిన కందుకూరు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో శోబోపేతంగా నిర్వహించటం, కనుమరుగవుతున్న క్రీడా స్ఫూర్తిని పెంపొందించే విధంగా ఎద్దుల బల ప్రదర్శన, పురుషుల కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నారని నిర్వహుకులని అభినందించారు. కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలను వీక్షించేందుకు వేలాదిమందిగా భక్తులు విచ్చేస్తున్నా తరుణంలో పోలీస్ భద్రతా, భక్తులకు సౌకర్యాలు తదితర ఏర్పాట్లను గురించి ఆలయ నిర్వహణలను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.

Related posts

రామేశ్వరం గ్రామంలో వికసించిన అరుదైన బ్రహ్మ కమలం

Satyam NEWS

ఆడవారి రుతుచక్రం క్రమబద్దీకరణకు మునగ ఆకుతో వైద్యం

Satyam NEWS

చంద్రయాన్‌-2 తాజా చిత్రాలివే

Satyam NEWS

Leave a Comment