33.7 C
Hyderabad
April 29, 2024 00: 31 AM
Slider ముఖ్యంశాలు

ఆడవారి రుతుచక్రం క్రమబద్దీకరణకు మునగ ఆకుతో వైద్యం

#artofliving

మునగ ఆకులతో కొన్ని వందల శారీరక రుగ్మతలు దూరం కావచ్చునని ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షకులు నంబాల కల్పనా తెలిపారు. నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే దివ్య ఔషధమే మనగాకు అని అన్నారు.

గురువారం శ్రీకాకుళం పట్టణం ప్రభుత్వ బాలికల పాఠశాలలో జరిగిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ పవిత్ర కార్యక్రమంలో భాగంగా హ్యాపీ, హెల్తీ, హైజిన్ రుతుచక్రంపై అవగాహన కల్పించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడవారి రుతుచక్రం క్రమ తప్పకుండా జరిగేందుకు మనగాకు చాలా మంచిందన్నారు.  తప్పనిసరిగా వాడాలని సూచించారు.

అందుకే బాలికలకు ఈ ఔషధ మొక్క అందుబాటులో ఉంచాలని, మేలు రకం మనగాకు విత్తనాలు తెప్పించి, 800 మందికి అందజేశామన్నారు. ఈ విత్తనాలు కొనుగోలు చేసి, ఉచితంగా పంపిణీ చేసేందుకు సహకరించిన ఎఒఎల్ డిడిసి సభ్యులు బి వి రవిశంకర్ చొరవకు  ఆమె అభినందించారు.

అనంతరం ఎఒఎల్ టీచర్ వారణాశి సందీప్ మాట్లాడుతూ మునక్కాయలు  మనం తినే ఆహారమే అయినా ఆకులో ఇంకా అద్భుతమైన పొషకాలలు ఉన్నాయన్నారు.  ఈ విషయం ఇటీవల జరిగిన ఆరోగ్య పరిశోధనల్లో వెల్లడైందన్నారు. మునగాకులో ఎ, సి విటమిన్లుతో పాటు కాల్షియం పుష్కలంగా ఉందని,. అలాగే మునగ కాయలతోపాటు పుష్పాలు, బెరడు, వేరు వంటి అన్ని భాగాలలో ఔషధ గుణాలు ఉన్నాయని వివరించారు.

కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయని, ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయని చెప్పారు. అంతేకాక మనగాకుతో నీటిని కూడా శుద్ధి చేయవచ్చునని చెప్పారు.

ఎఒఎల్ వాలంటీర్ సింధూ బాలికలకు అవసరమైన కొన్ని ఆసనాలలో శిక్షణనిచ్చారు. ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వాగ్ధేవి  మాట్లాడుతూ రెండు రోజులు పాటు ఇంత మంచి కార్యక్రమం తమ పాఠశాల నిర్వహించి, బాలికలకు శిక్షణనునిచ్చి, అవగాహన కల్పించినా ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీంకి అభినందనలు తెలిపారు.

Related posts

క్యూనెట్ లాంటి ఎంఎల్ఎం సంస్థల వలలో చిక్కుకోవద్దు

Bhavani

గణేష్ నిమజ్జనానికి కోవిడ్ నిబంధనల పాటించాలి

Satyam NEWS

నా కొడుకును చంపేయండి ఇలాంటి కొడుకు నాకొద్దు

Satyam NEWS

Leave a Comment