29.7 C
Hyderabad
May 2, 2024 05: 37 AM
Slider అనంతపురం

దొంగ ఓట్లు: మరో అధికారి సస్పెన్షన్

voter registration

ఏపిలో భారీగా దొంగ ఓట్లను చేరుస్తున్నారని వస్తున్న ఆరోపణలు నిజమేనని రుజువు చేస్తూ అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓట్ల తొలగింపు వ్యవహారంలో మరో ఉన్నతాధికారి సస్పెన్షన్ కు గురయ్యారు. అనంతపురంలో నాడు జడ్పీ సీఈఓగా ఉన్న శోభా స్వరూపా రాణీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే జడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు పడింది. భాస్కర్ రెడ్డికి ముందు అదే స్థానంలో పనిచేసిన స్వరూపా రాణీ పైనా ఇప్పడు సస్పెన్షన్ వేటు పడింది.

గతంలో అనంత జడ్పీ సీఈఓగా పని చేసిన సమయంలో ఉరవకొండ నియోజకవర్గంలో అక్రమంగా ఓట్ల తొలగింపునకు ఆమె బాధ్యురాలని నిర్ధారించారు. ప్రస్తుతం స్వరూపా రాణి ప్రస్తుతం బాపట్ల జిల్లా లో ETC (extension training center) కు గెజిటెడ్ ఇన్ స్ట్రక్టర్ గా పనిచేస్తున్నారు. 2021లో అనంతపురం జడ్పీ సీఈఓగా పని చేసిన సమయంలో అక్రమంగా 1796 ఓట్ల తొలగించారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపింది.

తాజా చర్యలతో అధికార పార్టీ కోసం నిబంధనలకు విరుద్దంగా పని చేసిన అధికారుల్లో తీవ్ర కలవరం చెలరేగుతున్నది. నిబంధనలకు విరుద్దంగా ఓట్ల తొలగింపు పాపం తమ మెడకు చుట్టుకుంటుదనే ఆందోళనలో  అధికారులు ఉన్నారు. ఓటర్ల జాబితాను ఇష్టారీతిన మార్చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. స్వయంగా సీఈవో కూడా ఇది నిజమేనని కరెక్ట్ చేస్తామని అంగీకరించాల్సి వచ్చింది. తర్వాత  సీఈవోను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పిలిచి క్లాస్ తీసుకున్నారు. ఓటర్ల జాబితాలో ఓట్లు తీసేయడం, కలపడం విచారణ తర్వాతే చేయాలని నిబంధనలు చెబుతున్నాయి.

ఎవరైనా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ధృవపత్రాలు తీసుకుంటారు. ఇప్పుడు ఆధార్ అప్రకటితంగా అయినా తప్పనిసరి చేశారు. అందుకే ఆధార్ సీడింగ్ చేసుకుంటే డబుల్ ఎంట్రీ ఉండే అవకాశం లేదు. దరఖాస్తు చేసుకున్నా ఇవ్వరు. అదే సమయంలో ఓటర్‌ను లిస్ట్ నుంచి తప్పించాలంటే. ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. సమాధానం ఇచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. కానీ ఏపీలో ఇలా  ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఓటర్లను తీసేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.

అలాగే ఎలాంటి ఆధార్ లేకుండానే లక్షల దొంగ ఓట్లను చేర్చారన్న ఆరోపణలూ వస్తున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో 30వేలకుపైగా జీరో డోర్ నెంబర్ తో ఉన్నాయి. కనీసం 25 నియోజకవర్గాల్లో గెలుపును ప్రభావితం చూపే స్థాయిలో ఈ దొంగ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ అది తప్పనిసరి కాదు. ఓటర్ కు ఇష్టమైతేనే ఇవ్వొచ్చు. ఆధార్ లేదన్న కారణంగా ఓటు హక్కు నిరాకరించలేరు.

ఇక్కడే దొంగ ఓట్లను చేర్చుకోవడానికి తమకు అనుకూలం కాని పార్టీల ఓటర్లను తొలగించడానికి ఓ అవకాశంగా చేసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఓట్ల గల్లంతు ఆరోపణలు ఇందుకే వస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో అధికారుల ప్రమేయంతోనే ఇలా జరుగుతాయి.  అందుకే టీడీపీ నేత పయ్యావుల కేశవ్ నేరుగా సీఈసీకి ఫిర్యాదు చేశారు. దాంతో ఒక ప్రత్యేక టీమ్ ను ఉరవకొండకు పంపించారు. దీంతో అక్రమాలు బయటపడ్డాయి. ఇద్దరు ముగ్గురు బీఎల్వోలను సస్పెండ్ చేశారు. ఇప్పుడు అది ఉన్నతాధికారుల వరకూ వచ్చింది. ఇప్పటికే అనేక జిల్లాలో నకిలీ ఓట్లు జాబితా బయటపడగా తాజాగా కర్నూలు జిల్లా అదోనిలోనూ ఇదే పరిస్థితి కనిపించింది.

ఆదోనిలో ఓటర్ల జాబితాలో భారీగా తప్పులతడకలు ఉన్నట్లు గుర్తించారు. 17 వార్డు లోని 222 వ పోలింగ్ కేంద్రం పరిధిలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఇంటి నెంబర్ 17లో 644 ఓట్లు ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. ఇక పోలింగ్ స్టేషన్ 223 పరిధిలోనూ ఇదే పరిస్థితి. ఇంటి నెంబర్ 17/836 లో ఏకంగా 706 ఓట్లు బయట పడ్డాయి. ఒకే ఇంట్లో వందల సంఖ్యలో నకిలీ ఓట్లు బయటపడటంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. జాబితాలో చనిపోయిన వారి పేర్లు కూడా తొలగించలేదు. 2019 ఎన్నికల వరకూ ఓటర్ల జాబితా బాగానే ఉన్నా ఆ తర్వాత భారీగా ఓట్లు జాబితాలో నమోదు అయ్యాయి. అనేక వార్డుల్లో భారీగా దొంగ ఓట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

కొద్ది రోజుల క్రితమే అధికారులు 10 వేల వరకూ ఓట్లను జాబితా నుంచి తొలగించారు. జాబితా ను ప్రక్షాళన చేయడంలో అధికారులు వైఫల్యం చెందారు. దొంగ ఓట్లను తొలగించాలంటూ టీడీపీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు, సీనియర్ టీడీపీ నేత ఉమాపతి నాయుడు డిమాండ్ చేశారు. కర్నూలులో ఎక్కువగా వాలంటీర్ల జోక్యం ఉన్నట్లుగా ఫిర్యాదులు రావడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.సుజనా  సిబ్బందిని ఆదేశించారు. కర్నూలు జిల్లాలో ఇంటింటికి ఓటర్ల సర్వే కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన కర్నూల్ రెవెన్యూ డివిజన్ లోని వెల్దుర్తి మండల కేంద్రంలో బీఎల్ఓ పై సస్పెన్షన్ వేటు వేశారు. 

వాలంటర్‌తో కలిసి బీఎల్ఓ ఇంటింటా సర్వేలో పాల్గొన్నారు. దీంతో కలెక్టర్ డాక్టర్ సుజనా సస్పెన్షన్ కు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాన్ని నిర్లక్ష్యం చేస్తే శాఖ పరమైన చర్యలు ఉంటాయని సూచించారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి వాలంటరీతో కలిసి సర్వే చేస్తే సస్పెన్షన్స్ ఉంటాయని సూచించారు. విశాఖలో 40 వేల ఓట్లను తొలగించారని టీడీపీ ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణ బాబు ఆరోపించారు. ‘‘ఓట్ల తొలగింపుపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. కలెక్టర్ ఇచ్చిన తప్పుడు నివేదికలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం.

సరైన యాక్షన్ లేకపోవడం వల్లే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. న్యాయం చేయాలని కోరాం. వీటన్నిటిపైన పరిశీలించేందుకు ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయాలని కూడా కోరాం. అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తాం. తాత్కాలిక వలసలు పేరుతో తొలగించారు. అసలు ఈ నిబంధనే లేదు. ఓట్ల తొలగింపుపై కలెక్టర్ తప్పుడు నివేదిక ఇచ్చారు అని ఎమ్మెల్యే  ఆరోపించారు.

Related posts

పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో అక్రమంగా మట్టి తవ్వకాలు

Satyam NEWS

విశాఖ మన్యంలో గిరిజన బాలిక అనుమానాస్పద మృతి

Satyam NEWS

రివర్స్ గేర్ :కెటిఆర్ కారు ను అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్

Satyam NEWS

Leave a Comment