37.2 C
Hyderabad
May 1, 2024 11: 37 AM
Slider ప్రకాశం

మరో మోసం: ఇంటి స్థలాలు ఇవ్వకుండానే నగదు మంజూరైనట్లు పత్రాలు

#house plots

ప్రకాశం జిల్లాలోని ఓ గ్రామంలోని ప్రజలకు జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు ఇవ్వకుండానే వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని అంతేకాకుండా నగదు మంజూరైనట్లు పత్రాలు అందించారు. అసలు స్థలమే కేటాయించని వాటికి నగదు రావడమేంటని గ్రామస్థులు వాపోతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ మోసకారి సంక్షేమం బయటపడింది.

అసలు ఇంటి స్థలమే ఇవ్వకుండా.. గృహానికి నగదు మంజూరైనట్లు పత్రాలు ఇచ్చారంటూ పెద్దనాగులవరం గ్రామస్థులు వాపోయారు. దీనిగురించి గ్రామస్థులు సబ్కలెక్టర్కు పిర్యాదు చేశారు. జగనన్న కాలనీలో 136 మందికి ఇంటి స్థలాలతోపాటు.. పలు దఫాలుగా ఒక్కో ఇంటికి రూ.5.1 లక్షలు ఇచ్చినట్లు ఆ పత్రాలలో చూపించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ఈ పత్రాలను అందించారు. అసలు ఇళ్ల స్థలాలే కేటాయించకుండా..

బిల్లులు ఇచ్చామని పత్రాలు అందించారని సబ్‌ కలెక్టర్‌కు గ్రామస్థులు మొర పెట్టుకున్నారు.”మార్కాపురం మండలంలోని పెద్దనాగులవరం గ్రామం మాదీ. మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు పత్రాలు అందించారు. ఇంటి స్థలానికి, ఇంటి నిర్మాణానికి నగదు అందించినట్లు ఆ పత్రాలలో చూపించారు. మాకు అంగుళం స్థలం ఇవ్వలేదు.” అని బాధితుడు అడివయ్య పేర్కొన్నారు.

Related posts

నాణ్యమైన రోడ్లతో మరింత అభివృద్ధి

Bhavani

తిరుపతిలో ఐదుగురు విద్యార్థులు అదృశ్యం

Bhavani

మహిళలు విద్యా, ఆరోగ్యం, కేరీర్‌పై దృష్టి పెట్టాలి

Satyam NEWS

Leave a Comment