38.2 C
Hyderabad
April 29, 2024 12: 24 PM
Slider కరీంనగర్

ఎటాక్:వేములవాడలో మరోకరి పై హాత్యాయత్నం

another sword attack in vemulawada

ప్రశాంతం గా ఉన్న వేములవాడ పట్టణంలో గత మూడు రోజులుగా దాడులు హాత్యాయత్నాలు జరుగుతుండగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.నిన్న రాత్రి పట్టణం లోని 3వ వార్డు టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ సోదరుడు రాజుపై కత్తితో ప్రత్యర్థులు దాడిచేసిన సంఘటన మరవక ముందే పట్టణం లోని బైపాస్ రోడ్ లోని మున్నూరు కాపు సత్రం ముందు శివ అనే యువకుడి మాజీ కౌన్సిలర్ ముద్రకోలా వెంకటేశం కత్తితో దాడి చేయగా కడుపులో కత్తి పోట్లు పడటం తో శివ పరిస్థితి విషమం గా ఉంది.

పాత కక్షలతో పాటు ఇటీవల జరిగిన ఎన్నికల్లో వెంకటేశం భార్య ఓటమికి గురికాగా దానికి కారణమనే నెపం తో శివ పై ఈ దాడి జరిగినట్లు తెలుస్తుంది.కాగా తనపై వెంకటేశం ఏకారణం గా రౌడీ షీట్ పెట్టించారని కోపం తో వెంకటేశం పై దాడికి శివ యత్నించినట్లు తెలుస్తుంది.ప్రతిగా వెంకటేశం శివపై కట్టి పోటీలు వేసినట్లు సమాచారం.కాగా శివ ఆటో నడుపుతూ జీవోనాపడి పొందుతున్నట్లు శివరామ కృష్ణ థియేటర్ సమీపం లోనే ఉంటున్నట్లు తెలిసింది.

స్థానిక డిఎస్పీ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఈ సంఘటన జరగడం పై సర్వాత్రా విస్మయానికి గురవుతున్నారు.సంఘటన స్థాలాన్న్ని సి ఐ శ్రీధర్ సందర్శించి బాధితున్ని ఆసుపత్రికి హుటాహుటినా తరలించారు.

మొన్న అర్థ రాత్రి పట్టణం లోని ఒక వార్డ్ కౌన్సిలర్ భర్త పై దాడి ,నిన్న కౌన్సిలర్ సోదరుడు రాజు పై దాడి జరగడం పై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండగానే ఈ ఘటన జరగడం పై పోలీస్ లు సీరియస్ గా ఉన్నారు.ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల లో తమకు వ్యతిరేకం గా చేసినా వారిపై దాడులు జరుగుతుండటంతో మరిన్ని సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ద్రుష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఈ సంఘటన పై పోలీస్ లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

పరిపాలన లో న్యాయస్థానాల జోక్యం తగదు

Satyam NEWS

ములుగులో ఘనంగా జాతీయ యువజన దినోత్సవం

Satyam NEWS

భారీగా పెరిగిన పంచాయతీ ఎన్నికల నామినేషన్లు

Satyam NEWS

Leave a Comment