39.2 C
Hyderabad
May 3, 2024 14: 19 PM
Slider విశాఖపట్నం

విశాఖ తెలుగుదేశం నాయకుడి ఆస్తులు నేలమట్టం

#Vizag

ఒక వైపు కరోనా విజృంభణ. మరో వైపు కరోనా రోగుల మరణ మృదంగం వినిపిస్తున్నది. ఆక్సిజన్ లేక జనం చచ్చిపోతున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వానికి మాత్రం ఇవేవీ పట్టలేదు.

విశాఖలో మరో టిడిపి నేత భవనం కూల్చివేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేయడం, వారి ఆస్తులు ధ్వంసం చేయడంలోనే వైసీపీ ప్రభుత్వం నిమగ్నమై ఉంది.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే, టిడిపి పార్లమెంట్ కన్వీనర్ పల్లా శ్రీనివాసరావు పాత గాజువాకలో నిర్మిస్తున్న భవనానికి అనుమతులు లేవంటూ జీవీఎంసీ అధికారులు తెల్లవారు జామున 5 గంటలకు కూల్చివేశారు.

నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. అయితే అధికారులు సరైన సమాధానం ఇవ్వలేదు.

కనీసం నోటీసుకూడా ఇవ్వకుండా అర్ధరాత్రి కుల్చివేతలు ఎలా జరుపుతారని ఆయన ప్రశ్నిస్తున్నారు.

భవిష్యత్తులో 200 మీటర్ల రోడ్ ఎక్విజిషన్ లో వుందని అందుకు తగ్గట్లుగా  6 నుంచి 7  మీటర్లు సెట్ బ్యాక్ కోసం విడిచి పెట్టానని ఆయన చెప్పారు.

ప్లాన్ లో 33 అడుగులు  విడిచిపెట్టమన్నారు.. ఇంకా సేకరణే జరగలేనపుడు అధికారులు ఎలా ఉల్లంఘనగా పరిగణిస్తారు….అని ఆయన ప్రశ్నించారు.

Related posts

మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సందర్శించిన ఉత్తమ్

Satyam NEWS

ఉత్సవాలు విజయవంతం

Murali Krishna

వాస్తుపురుషుడి కాటుతో కూలుతున్న సచివాలయం

Satyam NEWS

Leave a Comment