31.2 C
Hyderabad
May 3, 2024 02: 04 AM
Slider ఖమ్మం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక చర్యలు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని సిపిఐ ఎంఎల్ ప్రజాపంద రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం రామ నరసయ్య నగర్ గ్రామంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంద ఆధ్వర్యంలో అమరవీరుల వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంద నాయకులు ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు అనంతరం అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు. జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పార్టీ నాయకులు జెండా ఎగరవేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన సభలో రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు

మాట్లాడుతూ. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన ఎన్నికలను డబ్బుతో కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ స్థలన్నీ ప్రైవేటు పరం చేసి అదాని అంబానీ సంస్థలకు కట్టబెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలను సైతం కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు.

ప్రజాస్వామ్య హక్కులను కాల రాస్తున్నారని వాటిని తిప్పికొట్టేందుకు ప్రజాస్వామ్యవాదులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు కొనిజర్ల మండలంలో సిపిఎం ఎంఎల్ ప్రజాపంద నాయకుల పోరాట ఫలితంగా రామ నరసయ్య నగర్ విక్రం నగర్ ఎల్ ఎన్ నగర్ క్రాంతి నగర్ గ్రామాలు తండాలు ఏర్పడ్డాయని ఆయన అన్నారు అమరవీరుల త్యాగాలను ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలవాలని కోరారు పోడు భూములు సాగు చేసుకుంటున్నా రైతులకు ప్రభుత్వం ట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు అందజేయడంలో విఫలమయ్యారని విమర్శించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంద పార్టీ నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు కంకణాల అర్జున్ రావు పాశం అప్పారావు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

గ్రానైట్ వ్యాపారులకు నోటీసులు

Murali Krishna

నిరంకుశ విధానాలపై ఐక్యంగా పోరాడుదాం రండి కదలి రండి

Satyam NEWS

తిరుమలలో శ్రీ పురందరదాస‌ ఆరాధనా మహోత్సవాలు

Satyam NEWS

Leave a Comment