37.2 C
Hyderabad
May 2, 2024 13: 29 PM
Slider వరంగల్

మానసిక దివ్యాంగులకు నిత్యావసరాలు అందించిన అనురాగ్

#anurag

అనురాగ్ హెల్పింగ్ సొసైటి, రోటరీ క్లబ్ హన్మకొండ సంయుక్త ఆధ్వర్యంలో హన్మకొండ లోని అతిథి మానసిక దివ్యాంగం ఆశ్రమంలో నిత్యావసర వస్తువులు అందచేశారు. దివ్యాంగుల సేవ దైవసేవతో సమానమని అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్ డా॥కె.అనితారెడ్డి ఈ సందర్భంగా అన్నారు.

దివ్యాంగులకు అవసరమైన బియ్యం ఇతర నిత్యావసరాలు అందచేసినట్లు ఆమె తెలిపారు. అక్కడి పిల్లలకు నోట్ పుస్తకాలు, పండ్లు కూడా అందించారు.

దివ్యాంగులను ప్రేమ, ఆప్యాయతలతో చూడాలని అన్నారు. రోటరీ క్లబ్ హన్మకొండ ప్రెసిడెంట్ విజయకుమార్ మాట్లాడుతూ మానవసేవ నే మాధవ సేవ అని అన్నారు. అనురాగ్ సొసైటి, రోటరీ క్లబ్ అవసరార్థులకు అనాథలకు, దివ్యాంగులకు సేవ చేయడంలో, చేయూత నీయడంలో ముందుంటుందని అన్నారు.

ఈ కార్యక్రమ దాత కారుకాల రాంరెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు చేయూతనీయడం ఎంతో సంతృప్తి నిచ్చిందని, ఇక మీద కూడా సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా॥కె.అనితారెడ్డి, విజయకుమార్, కె.రాంరెడ్డి, నరేష్, ప్రభాకరరావు, అతిథి నిర్వాహకురాలు సుజాత పాల్గొన్నారు.

Related posts

ఫిషరీస్‌ యూనివర్సిటీ, ఆక్వా పార్కును ఏర్పాటు చేయబోతున్నాం

Satyam NEWS

రంజాన్ ప్రార్ధనలకు ముస్లింలు బయటకు రావద్దు

Satyam NEWS

కర్ణాటకలో కాంగ్రెస్​కు 130పైగా సీట్లు ఖాయం

Bhavani

Leave a Comment