మహారాష్ట్రలో సుపరిపాలన అందిస్తారని మెజార్టీ సీట్లు బీజేపీకి ప్రజలు కట్టబెట్టారని, అయితే బిజెపితో కలిసి పోటీ చేసిన శివసేన బీజేపీకి నమ్మకం ద్రోహం చేసిందని బిజెపి నాయకురాలు పురంధరేశ్వరి అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు బిజెపి నాయకులు బాణసంచా కాల్చి స్వీట్స్ పంచుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఫడ్నవిస్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని ఫడ్నవిస్ నిలబెడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ శివసేన అధికార దాహంతో నమ్మక ద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు. అద్భుతమైన పాలనను బీజేపీ మహారాష్ట్రలో అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తన స్వరూపనికి భిన్నంగా శివసేన వ్యవహరించిందని సోము వీర్రాజు అన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన అధికార దాహంతో చేతులు కలిపిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా సంఘటనా ప్రధాన కార్యదర్శి, సతీష్ జి, ఆంధ్రప్రదేశ్ సంఘటనా కార్యదర్శి మధుకర్ జి,తురగా నాగభూషణం, కంభంపాటి హరిబాబు, పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్, రావెల కిషోర్ బాబు, పైడికొండల మాణిక్యాలరావు, పార్థసారథి, జయప్రకాష్ నారాయణ వల్లూరు, అడపా శివనాగేశ్వరరావు, అయ్యాజి వేమ, యాళ్ల దొరబాబు, నగర అధ్యక్షుడు అడ్డురి శ్రీరామ్, భానుప్రకాష్ రెడ్డి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
previous post