ప్రజల భాగస్వామ్యం లేకుండా హైదరాబాద్ నగరంలో విస్తరిస్తున్న డెంగ్యూ వ్యాధిని అరికట్టడం సాధ్యం కాదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సీజన్ మార్పు వల్ల హైదరాబాద్ నగరంలో వైరల్ ఫీవర్ వ్యాపిస్తున్నదని ఆయన అన్నారు. ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్ని ఆస్పత్రులు సందర్శించారని తగిన చర్యలు తీసుకున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరపాలక సంస్థ అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.బబల్దియాలోని అన్ని విభాగాల అధికారులు మీటింగ్ లో పాల్గొన్నారని ఆయన తెలిపారు. నగర ప్రజలు డెంగీ పై ఆందోళన చెందుతున్నారని, దీనికి ప్రయివేటు ఆసుప్రతుల వారు భయపెట్టడమే కారణమని అన్నారు. బల్దియాను సీజన్లలో వచ్చే వ్యాధుల నివారణ, చర్యలపై క్యాలెండర్ ను రూపొందించాలని కోరాం. ప్రతి డిప్యూటీ కమీషనర్, అందరు అధికారులు రోజుకు మూడు అవగాహన సదస్సులు నిర్వహించాలని, స్కూల్, స్లమ్, అపార్ట్‌మెంట్ లో సదస్సులు పెట్టాలని, అక్కడ ఇలా వ్యాధులు ఎలా వస్తాయి అనేది అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.
previous post