28.7 C
Hyderabad
April 27, 2024 04: 14 AM
Slider ముఖ్యంశాలు

నిర్భయంగా ఓటు వేయాలని రాష్ట్ర డీజీపీ పిలుపు..!

#APDGP

అనుకున్న సమయానికి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ విజయనగరం జిల్లా కొత్తవలస లో రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసారు.

జిల్లా పోలీసులకు డీజీపీ వస్తున్నారన్న సమాచారం ముందు రోజే తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ పోలింగ్ కేంద్రానికి సమీపంలో ఎస్పీ కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల ను పరిశీలించారు.

ఈ నేపథ్యంలో పదకొండు గంటల ప్రాంతంలో కొత్తవలస పోలింగ్ కేంద్రానికి రాష్ట్ర డీజీపీ.. విశాఖ రేంజ్ డీఐజీ రంగారావుతో కలిసి వచ్చారు.

అప్పటికే అక్కడే పోలింగ్ కు సంబంధించి ఎస్పీ…సెట్ కాన్ఫరెన్స్ ద్వారా సిబ్బంది ని నమోదైన పోలింగ్ శాతాన్ని కనుక్కున్నారు.

ఆ వెంటనే వచ్చిన డీజీపీకి..ఎస్పీ వివరించారు. కాగా పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తున్న ఓటర్లను డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. అక్కడే వృధ్ధులైన ఓటర్లతో కాస్సేపు మాట్లాడారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణ, భద్రతను డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు.

ఓటు వేసేందుకు వచ్చిన వృద్దులతో మాట్లాడి, వారి యోగా క్షేమాలు అడిగి తెలుసుకొని, ఓటర్లను స్వేచ్చ గా ఓటు వేయాల్సిందిగా కోరారు.

ఈ పర్యటన లో..డీఐజీ, ఎస్పీతో పాటు విజయనగరం డీఎస్పీ అనిల్..ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ శేషాద్రి ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కలెక్టరెట్ లో సోలార్ షెడ్ ప్రారంభం

Bhavani

చితకొట్టుడు 2 గోష్ట్ వెర్ష‌న్ 2.0 టీజ‌ర్ విడుద‌ల‌

Sub Editor

ఒక్క సారిగా భగ్గుమన్న రాజధాని రైతులు

Satyam NEWS

Leave a Comment