28.7 C
Hyderabad
April 28, 2024 06: 00 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఒక్క సారిగా భగ్గుమన్న రాజధాని రైతులు

amaravathi fire

నిన్న మొన్నటి వరకూ నిరసనలకే పరిమితం అయిన ఏపి రాజధాని ప్రాంతం జిఎస్ రావు కమిటీ నివేదిక తో ఒక్క సారిగా భగ్గుమంది. సచివాలయంలో కి చొచ్చుకెళ్ళేందుకు రైతులు ప్రయత్నం చేశారు. సచివాలయం వద్ద ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా కట్టిన బ్యానర్లు చించివేశారు. మా శవాలపై కేక్ పెట్టి కట్ చేసుకోవాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర నిరసనలు తెలిపారు. పోలీసులు రాజధాని రైతులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 దాంతో పోలీసులకు రైతులకు మధ్య  తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు పెట్టిన బారికేడ్లు తన్నుకుంటూ రైతులు సచివాలయం వైపు రైతులు పరుగులు తీశారు.దాంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. సచివాలయం-మందడం వై జుంక్షన్ వద్ద రాజధాని రైతులు మెరుపు ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి జీఎన్ రావ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. జీఎన్ రావ్ కమిటీ సభ్యులు ఉన్నారేమో అని ప్రతి వాహనం తనిఖీ చేశారు.

Related posts

భ‌రోసా ప‌థ‌కం ద్వారా మ‌త్స్య‌కారుల జీవితాల్లో వెలుగులు

Satyam NEWS

ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయాలి

Bhavani

కరోనాని తరిమి కొడదాం

Satyam NEWS

Leave a Comment