33.7 C
Hyderabad
April 28, 2024 00: 20 AM
Slider ప్రత్యేకం

ఐదుగురు ఐఏఎస్‌ అధికారులకు జైలు శిక్ష

#APHighCourt

ఐదుగురు ఐఏఎస్‌ అధికారులకు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.  జైలు శిక్షపై అప్పీలుకు వెళ్లేందుకు నెల రోజుల పాటు శిక్షను సస్పెండ్‌ చేసింది. నెల్లూరు జిల్లాకు చెందిన తాళ్లపాక సాయి బ్రహ్మ అనే వ్యక్తికి నష్టపరిహారం చెల్లించకపోవటంపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది.

కోర్టు ఆదేశించినప్పటికీ సాయి బ్రహ్మకు న్యాయం చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ ఐఏఎస్‌ అధికారి మన్మోహన్ సింగ్‌కు నెల రోజుల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిరావుకు 2 వారాల జైలు శిక్ష, జరిమానా విధించింది.

ఐఏఎస్‌ అధికారి రావత్‌కు నెల రోజుల జైలు శిక్ష, వేయి రూపాయల జరిమానా, ముత్యాల రాజుకు రెండు వారాల జైలు శిక్ష, జరిమానా, ఏఎంబీ ఇంతియాజ్‌కు రెండు వారాల జైలు శిక్ష, జరిమానా విధించింది. అధికారుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి పిటిషనర్‌కు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Related posts

అమ్మ యోగీ!: విడాకులు తీసుకున్నారా అయితే ఓకే

Satyam NEWS

అమరావతి రైతులు పాదయాత్ర ఒక్కటే టీడీపీ కి ఆశ

Satyam NEWS

రెండేళ్ల పాలనా సంబరాలా..నవ్విపోదురుగాక..

Satyam NEWS

Leave a Comment