39.2 C
Hyderabad
April 28, 2024 13: 31 PM
Slider పశ్చిమగోదావరి

హౌసింగ్ ప్రోగ్రాం కు రెవెన్యూ పూర్తి సహకారం కావాలి

#joint collector housing

పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టరు(హౌసింగ్) గా బాధ్యతలు చేపట్టిన సూరజ్ ధనుంజయ్ ని AP JAC AMARAVATHI  పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్, రెవిన్యూ సంఘ జిల్లా అధ్యక్షుడు కె.రమేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో రెవిన్యూ శాఖ లోని గ్రామ రెవిన్యూ సహాయకుడు స్థాయి నుండి ఉప కలెక్టరు స్థాయి వరకు నూటికి నూరు శాతం శ్రమించి పని చేస్తూ సత్పలితాలను అందిస్తున్నారని తెలిపారు.

జిల్లా యంత్రాగం, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లా వ్యాప్తంగా పేదలకు 2,80,000 ఇళ్ళు పట్టాలు అందించామని తెలిపారు.

అన్ని వేళలా పౌరులకు సేవలందించటంలో రెవిన్యూ శాఖ స్పందించే విధానాన్ని కొనియాడుతూ,  పేదలకు ఇళ్ళు నిర్మాణ విషయంలో రెవిన్యూ శాఖ నుండి  పూర్తి సహకారం అందిచాలని సంయుక్త కలెక్టరు (హౌసింగ్) కోరారు.

ఈ కార్యక్రమములో జిల్లా కార్యదర్శి  ఎ. ప్రమోద్ కుమార్,  కె. వి. ఎల్ నారాయణ కో చైర్మన్ , వేణు వైస్ చైర్మన్ jac నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తిరుమలలో వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం

Satyam NEWS

మైపాడు గేట్ రోడ్డు వెడల్పుతో ఎంతో సౌకర్యం

Satyam NEWS

సుప్రీంకోర్టు తీర్పు: మళ్లీ ప్రధాన మంత్రి అయిన ఇమ్రాన్ ఖాన్

Satyam NEWS

Leave a Comment