28.7 C
Hyderabad
April 26, 2024 08: 45 AM
Slider ముఖ్యంశాలు

వందే భారతం నృత్య ఉత్సవ్‌ కోసం దరఖాస్తులకు ఆహ్వానం

#ajadikaamrutotsav

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా వందే భారతం నృత్య ఉత్సవ్‌ ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షీ లేఖి వెల్లడించారు. ఇందులో ఎంపిక అయిన 480 మంది  నృత్యకారులు గణతంత్య్ర దినోత్సవ పరేడ్‌ 2022 రోజున న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌ వద్ద సాంస్కృతిక కార్యక్రమ సమయంలో తమ ప్రదర్శన ఇవ్వవచ్చునని ఆమె వెల్లడించారు.

దేశవ్యాప్తంగా అత్యున్నత నృత్యకళాకారులను ఎంపిక చేయడంతో పాటుగా గణతంత్య్ర దినోత్సవ పరేడ్‌ 2022 నాడు సాంస్కృతిక కార్యక్రమ సమయంలో  తమ ప్రదర్శనలిచ్చే అవకాశం కల్పించడం ఈ పోటీల ముఖ్య లక్ష్యం ఆమె తెలిపారు. ఈ ప్రదర్శన జనవరి 26,2022 నాడు రాజ్‌పథ్‌,ఇండియా గేట్‌ (న్యూఢిల్లీ) వద్ద జరుగనుంది. మీనాక్షీ లేఖి ఈ విషయాన్ని న్యూఢిల్లీలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించడంతో పాటుగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ మొబైల్‌ యాప్‌ను సైతం విడుదల చేశారు.

దేశ సాంస్కృతిక వైభవం చాటి చెప్పాలి

మంత్రి లేఖి ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ ఈ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ మనం మన సాంస్కృతిక వైభవాన్ని మహోన్నతంగా చాటడంతో పాటుగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ద్వారా  భారతదేశపు మహోన్నతమైన భవిష్యత్‌ను సైతం వెల్లడిచేయాలని  ప్రధానమంత్రి తరచుగా చెబుతుంటారు’’ అని అన్నారు. వందేభారతం గ్రూప్‌ డ్యాన్స్‌ పోటీలు 17 నవంబర్‌ 2021వ తేదీ నుంచి డిజిటల్‌  ప్రవేశాలను జిల్లా స్థాయిలో ఆహ్వానిస్తున్నాయి. ఈ పోటీలు ముందుగా జిల్లా స్థాయిలో జరిగి, ఆ తరువాత రాష్ట్ర స్థాయి, అనంతరం జోనల్‌ స్ధాయిలో జరిగి చివరకు జాతీయ స్థాయి ఫైనల్స్‌ జరుగుతాయి. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి  రాష్ట్రపతి సహా మహోన్నతమైన  వ్యక్తుల ముంగిట ప్రదర్శన ఇచ్చే అవకాశం లభిస్తుంది.

ఈ పోటీలో పాల్గొనే అభ్యర్థులు నాలుగు నృత్య విభాగాలలో పోటీ పడవచ్చు. అవి శాస్త్రీయ, జానపద, గిరిజన మరియు ఫ్యూజన్‌/సమకాలీన నృత్యాలు. ఈ పోటీల ద్వారా 480 మందిని విజేతలుగా ఎంపిక చేస్తారు.

 ‘‘ఈ వేడుకలు మన సంప్రదాయ  నృత్య సంస్కృతిని ప్రతిబింబించాలని  ప్రధానమంత్రి ఆకాంక్షిస్తున్నారు. దేశ్‌ భక్తి గీతాలు, లోరీ,రంగోలీ వంటివి వీటిలో ఉండాలి’’ అని మంత్రి అన్నారు.

ఆజాదీ కా అమృత్‌మహోత్సవ్‌ను జన్‌ భాగిదారి స్ఫూర్తితో ప్రధానమంత్రి తలపెట్టారని మంత్రి వెల్లడించారు. భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరినీ ఈ వేడుకలలో భాగం చేసేందుకు ఈ  కార్యక్రమాలను ప్రాధమిక స్థాయికి తీసుకుని వెళ్లాల్సి ఉంది.  అంతేకాదు, మన వారసత్వం, సంస్కృతికి యువతను అనుసంధానించడం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో అత్యంత కీలకమైన అంశం అని ఆమె వెల్లడించారు.

ఏక్‌ భారత్‌, శ్రేష్ట్‌ భారత్‌ స్ఫూర్తితో మొత్తం దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని ఆమె తెలిపారు. భారతీయతను వేడుక చేయడమే ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ లక్ష్యమన్నారు.

సాంస్కృతిక శాఖ  ఓ వెబ్‌సైట్‌ను, మొబైల్‌ అప్లికేషన్‌ను డెవలప్ చేసిందని లేఖి వెల్లడిస్తూ, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం కోసం దీనిని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సకల అంశాలతో పాటుగా ఈ పోటీలను గురించిన సమాచారం కూడా ప్రజలకు ఇవి అందిస్తాయన్నారు.

ఈ మొబైల్‌ యాప్‌ మరియు వెబ్‌సైట్‌లు ప్రజలకు 17 నవంబర్‌ 2021 నుంచి అందుబాటులోకి వస్తాయంటూ జిల్లా స్ధాయి పోటీలను సైతం వెబ్‌సైట్‌/మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా మాత్రమే అంగీకరిస్తారన్నారు. ఈ పోటీలకు సంబంధించిన మార్గదర్శకాలు, ఇతర ఉపయుక్త సమాచారం ఈ యాప్‌, వెబ్‌సైట్‌ అందిస్తాయని ఆమె తెలిపారు.

ఈ పోటీలలో పాల్గొనేందుకు మీ దరఖాస్తులను www.vandebharatamnrityautsav.in వెబ్‌సైట్‌కు లేదా వందే భారతం మొబైల్‌యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని పంపడం చేయవచ్చు. మంత్రిత్వ శాఖ నిర్వహించే ఇతర పోటీలను గురించిన సమాచారం అంటే దేశ్‌భక్తి గీత్‌, లోరీ, రంగోలీ పోటీలు కోసం  www.amritmahotsav.nic.inచూడవచ్చు లేదా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ మొబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

For more Details, please contact: KALYAN CHAKRAVARTHY @ 9381340098

Related posts

ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ వర్సిటీలో రక్తదాన శిబిరం

Satyam NEWS

శబరిమల ఆలయం వద్ద 12 ఏళ్ల బాలికను అడ్డుకున్న పోలీసులు

Satyam NEWS

(Over The Counter) Nutrition Weight Loss Pills Koppla 3 Fas Motor Till 1 Fastest Weight Loss Pill

Bhavani

Leave a Comment