26.7 C
Hyderabad
April 27, 2024 09: 20 AM
Slider హైదరాబాద్

ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ వర్సిటీలో రక్తదాన శిబిరం

blod donation camp

హైదరాబాద్ లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఇ. సురేష్ కుమార్ విశ్వవిద్యాలయంలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) యూనిట్ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో డెబ్బై మంది విద్యార్థులు రక్తదానం చేశారు. విద్యార్థి వాలంటీర్ల భాగస్వామ్యంతో ఆరోగ్య కేంద్రంలో ఎన్‌ఎస్‌ఎస్ ఈ శిబిరాన్ని నిర్వహించింది.

ఈ సందర్బంగా ప్రొఫెసర్ ఇ. సురేష్ కుమార్ వైస్ ఛాన్సలర్ దాతలతో మాట్లాడుతూ, రక్తదానం చేయడం ద్వారా చాలా మంది ప్రాణాలు కాపాడిన వారవుతారని, ప్రతి ఒకరు కూడా  రక్త దానానికి ముందుకు రావాలని,  తలసేమియా, క్యాన్సర్ మరియు ఇతర రోగాలతో బాధపడుతున్న రోగులకు రక్త దానం సహాయపడుతుందని తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్, ప్రోగ్రాం ఆఫీసర్‌తో పాటు యూనివర్శిటీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్, సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Related posts

స్వర్ణకవచ్చాలంకృత అలంకరణలో దుర్గామాత

Satyam NEWS

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో టాప్ గేర్

Bhavani

కరోనాతో వారం రోజుల్లో 13 మంది జ‌ర్న‌లిస్టులు మృతి

Satyam NEWS

Leave a Comment