28.7 C
Hyderabad
May 5, 2024 07: 22 AM
Slider విజయనగరం

వచ్చేనెల 6న ఏపీయూడబ్ల్యూజే సమావేశాలు…!

#apuwj

గడచిన మూడేళ్లుగా కరోనా పుణ్యమా…నిస్తేజంలో పడ్డ ఏపీయూడబ్ల్యూజే మళ్లీ జవసత్వాలతో పుంజుకుంటోంది. అందులో భాగంగా… విజయనగరం జిల్లా కేంద్రంలో అదీ జిల్లా పరిషత్ సమావేశ మందిరం…అందుకు అంకురార్పణ కానుంది. వచ్చేనెల 6తేదీన యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నిలిస్టు(ఏపియుడబ్ల్యుజె) 26 మహాసభలను స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ భవనంలో ఉదయం 10 గంట నుండి నిర్వహస్తున్నామని యూనియన్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.వి.ఎస్‌. ఎస్‌.ప్రసాద్‌ తెలిపారు.

స్థానిక అంబటి సత్రంలో సర్.వై.చింతామణి సర్కిల్ వద్ద ఉన్న ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పీ.ఎస్.ఎస్. వీ ప్రసాద్(శివ) మాట్లాడారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మన్యం జిల్లా శ్రీకాకుళం నుంచి విజయనగరం జిల్లాలో కలిసిన  పాలకొండ, రాజాం ప్రాంతాలతో కలిపి మొత్తం 11 నియోజక వర్గాల నుంచి జర్నలిస్టుల ఈ సమావేశానికి హాజరు అవుతారని తెలియజేశారు.

అలాగే రెండుదశాబ్ధాలుగా (20ఏళ్ళు) పాత్రికేయవృత్తిలో అంకిత భావంతో పనిచేస్తున్న పాత్రికేయులకు ఈ సమావేశంలో సన్మానించడం జరుగుతుందని, తెలియజేశారు ,సమావేశంలో యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పంచాది అప్పారావు మాట్లాడుతూ ఈ సమావేశంతో పాటు ఉత్తరాంధ్ర పాత్రికేయుల సదస్సు కూడా ఉంటుందని జాతీయ స్థాయి పాత్రికేయ నాయకులు, రాష్ట్ర మీడియా సంఘ సలహాదారులు అమర్‌  ముఖ్య అతిథిగా విచ్చేస్తారని, అలాగే రాష్ట్ర నాయకులు, ఇంకా వివిధ పార్టీలకు నాయకులు కూడా విచ్చేస్తారని తెలిపారు.

కాగా ముందుగా మహాసభ అనంతరం సదస్సు జరుగుతుందని, తదపరి  ఏ జిల్లాలకు సంబంధించిన కార్యవర్గాలు  ఆయా  జిల్లాలో బాధ్యతలు వహిస్తారన్నారు. యూనియన్‌ వెబ్‌సెట్‌ కూడా అందుబాటులో ఉంటుందన్నారు. ముఖ్యంగా యూనియన్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం..పాత వారి రెన్యూవల్స్‌ చేస్తామని…రాష్ట్రంలో గత మూడు దశాబ్ధాలుగా యూనియన్‌ అనేక పోరాటాలు చేశారు. పాత్రికేయుల సంరక్షణ, రక్షణ, సంక్షేమానికి కృషి చేసిందని వివరించారు. ఈ సమావేశంలో చిన్న, మధ్యతరగతి పత్రికల యూనియన్‌ అధ్యక్షులు  కె.జే.శర్మ,  ప్రధాన కార్యదర్శి సముద్రాల నాగరాజు, మహాపాత్రో లింగాల నరసింగరావు, విజయభాస్కర్,సుబ్బయ్య పంతులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రకాశం బ్యారేజ్ కి లోకల్ వరద

Satyam NEWS

ప్రజల కోసం పరితపించే నాయకుడు కేటీఆర్

Satyam NEWS

సినిమా ధియేటర్ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ

Satyam NEWS

Leave a Comment