31.7 C
Hyderabad
May 2, 2024 10: 12 AM
Slider విజయనగరం

ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా సెంచరీ కి దగ్గరలో పెండింగ్ చలానాలు

#traffic

మీరు చదివింది నిజమే..వాస్తవమే..సత్యమే…అదీ “సత్యం న్యూస్. నెట్” చెబుతున్న నగ్న సత్యం. పాత ఈ-చలానాల వసూలుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన ట్రాఫిక్ పోలీసుల తనిఖీ లలో బయట పడిందీ మీరు చదివినది…అదీ విజయనగరం ట్రాఫిక్ విభాగానికి కొత్త గా వచ్చిన డీఎస్పీ విశ్వనాధ్ స్వీయ తనిఖీల్లో బయటపడిందీ…వైనం. ఈ మేరకు పెండింగ్ ఈ-చలానాల స్పెషల్ డ్రైవ్ విషయం పై…”సత్యం న్యూస్. నెట్” కు పలు విషయాలు చెప్పారు.

విజయనగరం లో వాహనాలపైగల పెండింగు ఈ-చలానాల వసూలుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లుగా ట్రాఫిక్ డిఎస్పీ డి. విశ్వనాధ్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆదేశాలతో ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టేందుకు విజయనగరంలో వివిధ కూడళ్ళులో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారన్నారు. వాహన తనిఖీల్లో వాహనాలపైగల పెండింగు ఈ-చలానాలను పరిశీలించి, వాహనదారులు ఈ-చలానాలను చెల్లించే విధంగా చర్యలు చేపట్టడంతో 163మంది వాహనదారులు తమ వాహనాలపై పెండింగులోగల పాత ఈ-చలానాలను చెల్లించారన్నారు.

ఈ ప్రత్యేక డ్రైవ్ లో ఒక మోటారు సైకిలుపై 93 ఈ-చలానాలు పెండింగులో ఉన్నట్లుగా గుర్తించామన్నారు. సదరు వాహనదారుడు వేరే వ్యక్తి నుండి వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో, గతంలో సదరు వాహనంపై పెండింగులో ఉన్న ఈ-చలానాలు గురించి తనకు తెలియనట్లుగా చెప్పడంతో ఆ వాహనాన్ని సీజ్ చేసామన్నారు. వాహనదారులు ఎవరైనా పాత వాహనాలను కొనుగోలు చేసే సమయంలో రికార్డులను పరిశీలించుకోవడంతోపాటు, సదరు వాహనంపై పెండింగులో ఉన్న ఈ-చలానాలు గురించి కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలన్నారు.

ఇలా తెలుసుకోకుంటే సదరు వాహనంపై పెండింగులో ఉన్న ఈ-చలానాలను చెల్లించాల్సిన బాధ్యత ప్రస్తుత వాహన యజమానిపైనే ఉంటుందని డిఎస్పీ స్పష్టం చేసారు. ఎం. వి. నిబంధనలను ఉల్లంఘించిన సమయంలో ఆయా వాహనాలపై నమోదైన ఈ-చలానాలను సాధ్యమైనంత త్వరగా చెల్లించాలన్నారు. ఈ-చలానాలను సకాలంలో చెల్లించకపోవడం వలన సదరు వాహనాలపై కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే సమయంలో పోలీసులు చేపట్టే వాహన తనిఖీల్లో ఇబ్బందులు ఎదుర్కొని, ఇబ్బందులకు గురికావల్సి ఉంటుందన్నారు.

కావున, వాహనదారులు తమ వాహనాల రికార్డులు, ఎం.వి.నిబంధనలు పాటించడం పట్ల, హెల్మెట్ ధారణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని ట్రాఫిక్ డిఎస్పీ డి.విశ్వనాధ్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ లో ట్రాఫిక్ ఎస్ఐలు లోవరాజు, రాజు, త్రినాధరావు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

దేవీ శ‌ర‌న్న‌వరాత్రుల సంద‌ర్బంగా ఆధ్యాత్మిక ప్ర‌వ‌చనం…!

Satyam NEWS

మిషన్ పై స్టూడెంట్ యూనిఫాం కుట్టిన టైలర్ రోజా

Satyam NEWS

రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా పండ్లు పంపిణీ

Satyam NEWS

Leave a Comment