28.7 C
Hyderabad
April 28, 2024 05: 24 AM
Slider పశ్చిమగోదావరి

ఏలూరు జిల్లా ద్వామా పి డి గా అరవపల్లి రాము

#Aravapalli Rama

ఏలూరు జిల్లా ద్వామా పి డి గా అరవపల్లి రాము శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ పి డి గా పనిచేసిన రాంబాబు కమిషనరేట్ కు రిపోర్ట్ చేయనున్నారు. ఏలూరు ద్వామా పి డి గా బాధ్యతలు చేపట్టిన రాము 1999లో ఎం పి డి ఓ గా ఎంపికయ్యి తొలుత నల్లజార్ల ఎం పి డి ఓ గాను తరువాత చాగల్లు, తాళ్ళపూడి, ఉంగుటూరు, కొవ్వూరు, నిడదవోలు ఎం పి డి ఓ గా పని చేశారు.

అక్కడ నుండి పదోన్నతి పై సెక్రటేరియట్ లో లీగల్ సెక్షన్ లో కోర్ట్ కేసులు పరిష్కార విభాగం లో పని చేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ప్రభుత్వం ఏలూరుజిల్లా ద్వామా పి డి గా పోస్టయి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం శని వారం ఏలూరు పి డి గా బాధ్యతలు చేపట్టామని తెలిపారు. శని వారం విధులు చేపట్టిన రాము ని పలువురు జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియ జేశారు. అయితే ఏలూరు ద్వామా కార్యాలయం లో సుమారు 5 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నట్టు సమాచారం.

గతం లో ఓ మండలం లో కూడా కరువు పనుల్లో సుమారు 2.5 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని గతం లో అక్కడ పని చేసిన ఓ అధికారి ద్వామా విజిలెన్స్ అధికారిగా కూడా విధులు నిర్వహించి ఆయన కాలం లో జరిగిన 2.5 కోట్ల అక్రమాలను ఆయనే విచారణాధికారి గా వెళ్లి రికార్డులను తారు మారు చేసి ఆ మండలం లో ఎటువంటి అక్రమాలు జరగలేదని విచారణ రిపోర్ట్ లో ఆయనే తేల్చినట్టు విశ్వసనీయ సమాచారం.

Related posts

సమస్యలు పట్టించుకోని రామాంతపూర్ కార్పొరేటర్

Satyam NEWS

అవినీతిపరుల ‘సత్య ప్రమాణం’ రాజకీయాలు

Satyam NEWS

అంతిమ తీర్పులో మంగ్లీ ‘టిప్ప.. టిప్ప’ పాటకు మంచి స్పందన

Satyam NEWS

Leave a Comment