36.2 C
Hyderabad
May 10, 2024 17: 25 PM
Slider తెలంగాణ

ఆ స్టిక్కర్స్ ఉన్నాయా..జాగ్రత్త

are there those stickers..be careful

రాష్ట్రం లో వాహనాలపై ప్రెస్, పోలీస్, ఎమ్మెల్యే స్టిక్కర్స్ తగిలించుకొని తిరుగుతున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఆ స్టిక్కర్ల అంటించుకున్న వాహనదారులు పర్సనల్ ఐడీ కార్డులు లేదంటే ప్రొఫెషనల్ ఐడీ కార్డులు చూపిస్తేనే వదులుతామని లేదంటే కేసు నమోదు చేసి చలానా వసూలు చేస్తామంటున్నారు.  డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, వాహనాల పేపర్లు లేకుండా బైక్‌లపై కేవలం పోలీస్ ఆర్మీ డిఫెన్స్ , ప్రెస్ ఎమ్మెల్యే,  డాక్టర్, అడ్వకేట్ అని స్టిక్కర్లు పెట్టుకొని రోడ్లపైకి వచ్చే నకిలీగాళ్లకు చెక్ పెట్టాలని  ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఇలాంటి వాహనాలు తెలంగాణ రాష్ట్రం పరిధిలో ఎక్కడ కనిపించినా ఆపి మరి ప్రత్యేకంగా తనిఖీలు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ప్రముఖుల వ్యక్తుల పేర్లతో, సమాజంలో గౌరవప్రదమైన హోదా కలిగిన వ్యక్తులు, సంస్థల పేర్ల ను అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా వాహనాలపై తిరిగే వాళ్లకు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు  ట్రాఫిక్ పోలీసులు. ఎవరైనా వాహనంపై స్టిక్కర్ అంటించుకుంటే దానికి సంబంధించిన వ్యక్తిగత, లేదంటే ప్రొఫెషనల్ గుర్తింపు కార్డును తప్పని సరిగా చూపిస్తేనే వదులుతామని పోలీసులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో వాహనంపై ఎలాంటి స్టిక్కర్ అంటించినప్పటికి సరైన ఐడీ కార్డు, పర్సనల్ ఐడెంటిటి కార్డు లేకపోతే అలాంటి వాహనాల్ని సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.  ఈ ప్రక్రియను ఇప్పటికే రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాలలో   ట్రాఫిక్ పోలీసులు ప్రారంభించారు. హైదరాబాద్ లో ఎం‌ఎల్‌ఏ గువ్వల బాలరాజు వాహనానికి వున్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించారు. నటుడు ఎన్‌టి‌ఆర్ వాహనానికి కూడా బ్లాక్ ఫిల్మ్ తొలగించారు. ఇదే సమయంలో ప్రెస్ స్టిక్కర్ తో వున్న అనేక వాహనాలను సీజ్ చేశారు.  రోడ్డు ప్రమాదాలను అరికట్టడం కోసం పోలీసులు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికి వర్కవుట్ కావడం లేదు. రీసెంట్‌గా హైదరాబాద్ జూబ్లిహిల్స్ కారు ప్రమాద ఘటన తర్వాత ట్రాఫిక్ పోలీసులు ఈనిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు. ఈ నకిలీ స్టిక్కర్లు తగిలించుకొని బైక్‌లు, కార్లలో తిరుగుతున్న వారిపై వెస్ట్‌ జోన్, సెంట్రల్ జోన్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సరైన ఆధారాలు చూపించని వాహనదారులపై సీఎంవీ నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేసి చలాన్లు వసూలు చేస్తున్నారు.

Related posts

వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చే బాధ్యత నాది

Bhavani

చంద్రబాబు వల్ల రూ.68వేల కోట్లు దుర్వినియోగం

Satyam NEWS

పోలీసులు నిర్వహించే స్పందనకు వచ్చిన ఫిర్యాదులు ఎన్నంటే…!

Satyam NEWS

Leave a Comment